మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జీవో విడుదల చేశాయి. పెరిగిన టికెట్ ధరల వివరాలు ఈ కథనంలో ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం జనవరి 12న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 11 రాత్రి నుంచే ప్రీమియర్ షోల హంగామా మొదలవుతుంది.డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రంలో చిరంజీవిని వింటేజ్ మెగాస్టార్ గా చూపించబోతున్నారు. చాలా రోజుల తర్వాత చిరు ఎంటర్టైనింగ్ రోల్ లో కనిపించబోతుండడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
25
టికెట్ ధరలు పెంచుతూ జీవో
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కూడా చిరంజీవి సినిమాకు సపోర్ట్ వచ్చేసింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ అనుమతి ఇచ్చారు. జనవరి 12 నుంచి పది రోజుల పాటు ఏపీలో పెరిగిన టికెట్ ధరలు అమలులో ఉంటాయి. అదే విధంగా తెలంగాణలో పెరిగిన టికెట్ ధరలు మొదటి 7 రోజుల పాటు అమలులో ఉంటాయి.
35
ఏపీలో మన శంకర వరప్రసాద్ గారు టికెట్ ధరలు
ఏపీలో ఈ చిత్రానికి జనవరి 12 నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్స్ లో రూ.100, మల్టీ ప్లెక్స్ లలో రూ 125 పెంచుకునేలా వీలు కల్పించారు. 11 వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలకు జీఎస్టీతో కలిపి రూ 500 టికెట్ ధర నిర్ణయించారు. పెరిగిన రేట్ల ప్రకారం ఏపీలో టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.
ప్రీమియర్ షోల టికెట్ ధర : రూ.500 (జనవరి 11, 2026)
సింగిల్ స్క్రీన్ టికెట్ ధర : రూ. 247 ( జనవరి 12 నుంచి 10 రోజుల పాటు)
మల్టీప్లెక్స్ టికెట్ ధర : రూ. 302 ( జనవరి 12 నుంచి 10 రోజుల పాటు)
తెలంగాణలో ఈ చిత్రానికి జనవరి 12 నుంచి 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోలకు జీఎస్టీతో కలిపి రూ 600 టికెట్ ధర నిర్ణయించారు. రెగ్యులర్ షోలకు జనవరి 12 నుంచి సింగిల్ స్క్రీన్స్ లో రూ 50, మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంచుకునే వీలు కల్పించారు. తెలంగాణలో ఈ చిత్రానికి పెరిగిన రేట్ల ప్రకారం టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.
ప్రీమియర్ షోల టికెట్ ధర : రూ.600 (జనవరి 11, 2026)
సింగిల్ స్క్రీన్ టికెట్ ధర : రూ. 227 ( జనవరి 12 నుంచి 7 రోజుల పాటు)
మల్టీప్లెక్స్ టికెట్ ధర : రూ. 395 ( జనవరి 12 నుంచి 7 రోజుల పాటు)
55
ఫ్యామిలీలకు చుక్కలే
సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలి అనుకుంటే జేబు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. నలుగురు సభ్యులు ఉన్న ఫ్యామిలీ తెలంగాణ మల్టిప్లెక్స్ లో ఈ సినిమా చూడాలనుకుంటే కేవలం టికెట్ ధరల ఖర్చే దాదాపు 1600 అవుతుంది. ఇక పాప్ కార్న్, కూల్ డ్రింక్ లాంటివి కలుపుకుంటే మరో 1000 ఖర్చు గ్యారెంటీ. అంటే మొత్తంగా ఫ్యామిలీలు దాదాపు రూ 2500 పైగా సమర్పించుకోవాల్సిందే.