చిరంజీవి, అనిల్ రవిపూడి కాంబినేషన్‌లో చేసిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే.
మెగాస్టార్ చిరంజీవి ఈసంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` సినిమాతో అల్లాడిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్ సినిమాకి పెద్ద అసెట్‌గా నిలిచింది.
210
మంచి వసూళ్ల దిశగా మన శంకర వర ప్రసాద్ గారు మూవీ
అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి, చిరంజీవి కామెడీ టైమింగ్, యాక్టింగ్ తోడు కావడంతో సినిమా మరో స్థాయికి వెళ్లింది. ఆడియెన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబడుతోంది.
310
మన శంకర వర ప్రసాద్ గారు మూవీ మొదటి రోజు కలెక్షన్లు
`మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ మూవీ మొదటిరోజు ఊహించని వసూళ్లని రాబట్టింది. ఇది మొదటి రోజు ఏకంగా రూ.84కోట్లు వసూలు చేసింది. ఆరవై కోట్లు దాటితే ఎక్కువ అనుకుంటే, ఏకంగా ఎనబై కోట్లకుపైగా గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఈ మూవీకి అందరి నుంచి హిట్ టాక్ వచ్చింది. నెగటివ్ టాకే లేదు. అదే ఈ మూవీకి పెద్ద అసెట్‌గా మారిందని చెప్పొచ్చు. సినిమాని చూసిన ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అది కలెక్షన్లకి కలిసి వచ్చింది.
510
మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రెండు రోజుల కలెక్షన్లు
ఇక రెండు రోజు సగానికి పడిపోయింది. రూ.36కోట్లు రాబట్టింది. సినిమాల పోటీ ఉన్నప్పటికీ ఈ రేంజ్‌లో వసూళ్లని రాబట్టడం విశేషమనే చెప్పాలి. ఇప్పటి వరకు ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.120కోట్లు రాబట్టిందని టీమ్ ప్రకటించింది. బాక్సాఫీసు వద్ద చిరంజీవి రచ్చ వేరే లెవల్‌లో ఉందని తెలిపింది.
610
సక్సెస్ సెలబ్రేషన్‌లో మన శంకర వర ప్రసాద్ గారు మూవీ టీమ్
ఈ అంతేకాదు టీమ్ కూడా సక్సెస్ సెలబ్రేషన్‌లో మునిగిపోయారు. మంగళవారం బ్లాక్ బస్టర్ థ్యాంక్స్ మీట్ పెట్టారు. రాత్రి చిరంజీవి ఏకంగా టీమ్ అందరికి పార్టీ కూడా ఇచ్చాడు. ఇందులో టీమ్ అంతా పాల్గొని రచ్చ చేశారు.
710
మన శంకర వర ప్రసాద్ గారు మూవీ సక్సెస్ సెలబ్రేషన్
ఇక `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ సక్సెస్ సెలబ్రేషన్‌లో చిరంజీవి, వెంకటేష్, అనిల్ రావిపూడి, నిర్మాతలు సుస్మిత, సాహు గారపాటి, కెమెరామెన్, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ ఇతర టీమ్ అంతా పాల్గొన్నారు.
810
మన శంకర వర ప్రసాద్ గారు మూవీ సెలబ్రేషన్‌లో చరణ్ స్పెషల్ ఎట్రాక్షన్
వీరితోపాటు ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. ఆయన స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆయన లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, అవి వైరల్ అవుతున్నాయి.
910
మన శంకర వర ప్రసాద్ గారు మూవీ థియేట్రికల్ బిజినెస్
`మన శంకర వర ప్రసాద్ గారు` మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ.140కోట్లకుపైగా థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.105కోట్లు, ఇతర రాష్ట్రాల్లో కలిసి రూ.120కోట్లు అయ్యిందని, ఓవర్సీస్ కలిపి రూ.140కోట్ల వరకు బిజినెస్ అయ్యిందని సమాచారం.
1010
40శాతం కలెక్షన్లు రికవరీ
ఈ లెక్కన సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇది సుమారు మూడు వందల కోట్లు రాబట్టాలి. ఇప్పుడు 40శాతం వచ్చింది. ఇంకా 60 శాతం రావాలి. మరి అది ఎంత వరకు సాధ్యమనేది చూడాలి. మూడు వందల కోట్ల మార్క్ ని దాటితే మాత్రం ఈ చిత్రం పెద్ద హిట్‌గా చెప్పొచ్చు.