ముమ్మట్టి 'టర్బో' మూవీ రివ్యూ

First Published | Aug 12, 2024, 7:37 AM IST

 ముమ్మట్టి నుంచి వచ్చిన మరో యాక్షన్ సినిమా. హీరోయిజం, బిల్డప్ లు భీబత్సంగా ఉంటాయి. 

Turbo movie

యాక్షన్ సినిమాలకు ఎప్పుడూ కావాల్సినంత డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్స్ చేసే యాక్షన్ తెగ నచ్చుతుంది. ఆ సీక్వెన్స్ లో సాధ్యాసాధ్యాలు పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తూంటారు. అలా తనకంటూ యాక్షన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఇంత వయస్సు వచ్చినా మెగాస్టార్ ఇమేజ్ తో ముందుకు వెళ్తూ విభిన్న తరహా సినిమాలు చేస్తున్న ముమ్మట్టి తాజా చిత్రం టర్బో. ఈ సినిమాలో  మ‌న తెలుగు క‌మెడియ‌న్ సునీల్ (Sunil), క‌న్న‌డ న‌టుడు రాజ్ బీ షెట్టి (Raj B. Shetty) కీల‌క పాత్ర‌ల్లో కనిపిస్తారు. మళయాళంలో వచ్చి సక్సెస్ అయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో తెలుగు వారిని పలకరించింది. సినిమా ఎలా ఉందో చూద్దాం.
 

turbo

కథేంటి


 జోసీ అలియాస్‌ టర్బో (మమ్ముట్టి) తన వాళ్లకు ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకునే రకం కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవలు పడుతూండే అతను కేవలం తల్లికి మాత్రమే భయపడుతూంటాడు. ఊళ్లో జాతర సమయంలో తన స్నేహితుడు జెర్రీ (శబరీష్‌) ని వెనక నుంచి వచ్చి ఒకరు కొట్టేసి వెళ్లిపోవటం చూస్తాడు. అయితే అందుకు కారణం రెగ్యులర్ గొడవలు కాదని, అతని లవ్ స్టోరీ అని తెలుసుకుంటాడు. జెర్రీ తన బ్యాంక్ లో పనిచేసే ఇందులేఖ (అంజనా జయప్రకాశ్‌) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే అందుకు ఆమె ఇంట్లో వాళ్ల నుంచి అభ్యంతరం ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఎంగేజ్మెంట్ చేసి, అతన్ని దూరం చేయాలని కొట్టడానికి రౌడీలను పురమాస్తారు.
 

Latest Videos


mammootty


దాంతో తన స్నేహితుడు ప్రేమని గెలిపించటానికి రంగంలోకి దిగిన టర్బో..ఆమె ఇంటి కెళ్లి గొడవ చేసి , ఎత్తుకొచ్చి డైరక్ట్ గా జెర్రీ ముందు నిలబడతాడు. అయితే జెర్రీ ఇది ఊహించడు. తన ఇంట్లోవాళ్లను ఇంకా ఒప్పించి ఉండకపోవటంతో భయపడి ఆమె ఎవరో తకు తెలియదు అన్నట్లు బిహేవ్ చేస్తాడు. దాంతో టర్బోకు ఏం చేయాలో అర్దం కాదు. ఆమె చెన్నే వెనక్కి వెళ్ళిపోతుంది. ఆమె ఇంట్లో వాళ్లు టర్బోపై కిడ్నాప్ కేసు, హత్యాయత్నం కేసు పెడతారు. పోలీస్ లు అరెస్ట్ చేయటానికి సిద్దపడతాడు. ఈ క్రమంలో వేరే దారిలేక టర్బో తాను కూడా చెన్నై వెళ్తాడు. అక్కడే ఈ గొడవలు సర్దమణిగే దాకా ఉండాలని అనుకుంటాడు. జెర్రీని కలుస్తాడు.

turbo movie


అయితే ఓ రోజు జెర్రీ సూసైడ్ చేసుకుంటాడు. టర్బో ఇది ఫెయిల్యూర్ వల్లే ఆత్మహత్య అనుకుంటారు. పోలీస్ లు అలాగే కేసు మూసేస్తారు. కానీ కొద్ది రోజులకు అది సూసైడ్ కాదని పక్కా ప్లాన్ చేసి చేసిన హత్య అని అర్దమవుతుంది. దీని వెనక కోట్ల స్కామ్ ఉందని, అది జెర్రీ వల్ల బయిటపడేలా ఉందని చంపేసారని అర్దమవుతుంది. ఇదే క్రమంలో అదే బ్యాంక్ లో చేస్తున్న ఇందులేఖని కూడా చంపటానికి ప్రయత్నాలు జరుగుతాయి. టర్బో దీన్ని ఛేధించి, ఆమెను సేవ్ చేయాలనుకుంటాడు. అందుకోసం ఏం చేసాడు. ఈ స్కామ్ ని నడిపిస్తూ హత్యలు చేస్తున్న   వెట్రివేల్‌ షణ్ముగ సుందరం   ( రాజ్ బి శెట్టి) ఊరుకున్నాడా...ఆ స్కామ్ ఎలా చేస్తున్నారు. అలాగే సునీల్ క్యారక్టర్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

Turbo Movie

 
విశ్లేషణ

ఇది ముమ్మట్టి నుంచి వచ్చిన మరో యాక్షన్ సినిమా. హీరోయిజం, బిల్డప్ లు భీబత్సంగా ఉంటాయి. ఫ్యాన్స్ పండగ చేసుకునే సీక్వెన్స్ లు డిజైన్ చేసారు. ముమ్మట్టి కూడా ఈ వయస్సులో తగ్గేదేలే అన్నట్లు యాక్షన్ సీక్వెన్స్ లు చేసారు. అయితే కథలోనే సమస్య ఉంది.  సినిమా ఫస్టాఫ్ అయినా హీరో సమస్యలో పడడు. విలన్ ఎవరో తెలియదు. విలన్ కు ఇతనెవరో తెలియదు. యాక్షన్ సినిమాల్లో ఇది చాలా  ప్రమాదం. అలాగే విలన్ వైపు కథ నడుస్తూంటుంది. విలన్ యాక్షన్ కు హీరో ముమ్మట్టి స్పందిస్తూంటాడే తప్పించి హీరో...విలన్ కు సవాళ్లు విసిరి ఇరుకున పెట్టడు. దాంతో హీరో క్యారక్టర్ చాలా ప్యాసివ్ గా మారిపోయి...యాక్షన్ తెరపై నడుస్తున్నా ఏదో  వెలితిగా అనిపిస్తుంది. అలాగే హీరోకు తల్లి తప్పించి తన స్నేహితుడుతో ఎమోషనల్ ఎటాచ్మెంట్ కనపడదు. 

turbo movie


దాంతో తన స్నేహితుడు కోసం అతను యాక్షన్ లోకి దిగినా మనకేమీ అనిపించదు. అయితే ప్లస్ ఏమిటంటే సినిమా ముమ్మట్టికి హీరోయిన్ ని పెట్టలేదు. అలాగే పాటలు కూడా లేవు. నీట్ గా సీన్ బై సీన్ వెళ్లిపోతుంది. ఇక సినిమాకు కీ పాయింట్ అయిన  స్కామ్ ని సరిగ్గా అర్దమయ్యేలా చెప్పలేకపోయారు. ఆ స్కామ్ మూలంగా ఎవరికి నష్టం వస్తుంది అనేది చెప్పలేకపోతే మనకు విలన్ మీద కోపం ఎందుకు వస్తుంది? అనే బేసిక్ విషయం మర్చిపోయారు.డైరక్టర్ వైశాఖ్ ..హీరోయిజం ఎలివేషన్స్ పై పెట్టిన శ్రద్ద కథపై పెట్టలేదనిపిస్తుంది. 
 

mammootty turbo movie


టెక్నికల్ గా ...

నటీనటుల్లో ముమ్మట్టి ఎప్పటిలాగే అదరకొట్టాడు. తన వయస్సుని తన ఉషారుతో దాటేసారు. ఇక విలన్ గా  రాజ్ బి శెట్టి  సెట్ కాలేదనిపించింది. ఆ క్రూరత్వం సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. సునీల్‌  ఫన్ టైమింగ్ బాగుంది కానీ అతనికి తగ్గ పాత్ర కాదు.  టెక్నికల్ గా సినిమా బాగుంది.  యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. విష్ణు శర్మ కెమెరా వర్క్,  .. క్రిస్టో సేవియర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫెరఫెక్ట్ గా ఉన్నాయి.

turbo movie mammootty


ఫైనల్ ధాట్

ఈ సినిమా ఫ్యాలిలీతో కాలక్షేపంగా చూడదగినిదే. కొంత రొటీన్ అనిపించినా నేరేషన్ స్పీడుగా ఉండటంతో అలా అలా వెళ్లిపోతుంది. ఓ లుక్కేయచ్చు.  కాలక్షేపానికి లోటు లేకుండా సినిమా నడిచిపోతుంది.

ఎక్కడ చూడవచ్చు

 సోనీలివ్‌ వేదికగా ఓటీటీలో తెలుగులో ఉంది.
 

click me!