Suriya: 50 ఏళ్ల సూర్య తన క్రష్ అంటున్న 25 ఏళ్ల హీరోయిన్ ఎవరో తెలుసా? ఇద్దరు జంటగా నటిస్తున్నసినిమా ఏది?

Published : Aug 04, 2026, 03:17 PM IST

Suriya: తనకంటే 25 ఏళ్ల పెద్దవాడైన హీరో సూర్య అంటే క్రష్ అంటోంది ఓ హీరోయిన్. చిన్నతనం నుంచి ఎంతో ఇష్టమైన హీరోకి జంటగా నటింస్తోంది బ్యూటీ. సూర్యతో రొమాన్స్ చేయబోతున్న ఆ హీరోయిన్ ఎవరు?

PREV
15
రిలీజ్‌కు రెడీగా విశ్వనాథ్ అండ్ సన్స్

హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్టు 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సూర్య గురించి మమితా బైజు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలా మంది అమ్మాయిల కలను తాను ఇప్పుడు జీవిస్తున్నానని, చిన్నప్పటి నుంచి సూర్య అంటే తనకు క్రష్ అని మమితా చెప్పింది. 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రమోషన్ కార్యక్రమంలో మమితా ఏమన్నదంటే.?

25
మమితా బైజు మాట్లాడుతూ..

"ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు, చాలా మంది అమ్మాయిల కలను నేను ఇప్పుడు జీవిస్తున్నాను. చిన్నప్పటి నుంచి సూర్య సార్ నా క్రష్. 'గజని' సినిమా చూసినప్పటి నుంచి ఆయనంటే నాకు పిచ్చి అభిమానం. నిజానికి మేమిద్దరం కలిసి ఇంతకుముందే ఒక సినిమా చేయాల్సింది. కానీ ఎందుకో ఆ సినిమా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన క్రమశిక్షణ, ఒక సీన్‌ను ఆయన అప్రోచ్ అయ్యే విధానం, ఆన్-స్క్రీన్, ఆఫ్-స్క్రీన్‌లో ఆయన ప్రవర్తన.. అన్నీ నాకు మంచి ఇన్‌స్పిరేషన్," అని మమితా బైజు చెప్పుకొచ్చింది.

35
రిలీజ్‌కు ముందే రూ.300 కోట్ల బిజినెస్

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాట సూపర్ హిట్ అయింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే రూ.300 కోట్ల బిజినెస్ చేసి రికార్డు సృష్టించింది. సూర్య కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ప్రీ-రిలీజ్ బిజినెస్ కావడం విశేషం.

45
ఓటీటీ హక్కులు ఎవరు కొన్నారంటే?

ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సుమారు రూ.85 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. సూర్య 46వ చిత్రంగా వస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్', బ్లాక్‌బస్టర్ హిట్ 'లక్కీ భాస్కర్' తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా.

55
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా..

ఈ చిత్రానికి వెంకీ అట్లూరినే కథ, స్క్రీన్‌ప్లే అందించారు. రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్, భవానీ శ్రీ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్, పోస్టర్లు, పాటలు చూస్తుంటే ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories