రష్మీ రెమ్యునరేషన్ పై హైపర్ ఆది ఓపెన్ కామెంట్స్.. దిమ్మతిరగాల్సిందే..

Published : Oct 14, 2022, 09:55 AM IST

హైపర్ ఆది తిరిగి ఎంట్రీ ఇవ్వడంతో జబర్దస్త్ షో కళకళలాడుతోంది. కామెడీ పంచ్ లు ప్రవాహంలా వస్తున్నాయి. వచ్చామా స్కిట్ చేశామా అన్నట్లు లేకుండా కమెడియన్స్ అంతా కలిసి విభిన్నంగా స్కిట్ చేస్తూ నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు.

PREV
16
రష్మీ రెమ్యునరేషన్ పై హైపర్ ఆది ఓపెన్ కామెంట్స్.. దిమ్మతిరగాల్సిందే..

హైపర్ ఆది తిరిగి ఎంట్రీ ఇవ్వడంతో జబర్దస్త్ షో కళకళలాడుతోంది. కామెడీ పంచ్ లు ప్రవాహంలా వస్తున్నాయి. వచ్చామా స్కిట్ చేశామా అన్నట్లు లేకుండా కమెడియన్స్ అంతా కలిసి విభిన్నంగా స్కిట్ చేస్తూ నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో ఆసక్తికరంగా ఉంది. 

26

కమెడియన్లు రెండు టీమ్స్ గా విడిపోయి ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. బులెట్ భాస్కర్, ఇమ్మాన్యూల్, రాకింగ్ రాజేష్ ఒక గ్యాంగ్ గా మారి క్రికెట్ బ్యాట్స్ తో ఎంట్రీ ఇచ్చారు. మా ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇద్దరు అబ్బాయిలని ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు వలలో వేసుకున్నారు. మా అబ్బాయిలని వదిలేయండి.. లేకుంటే రక్తపాతాలే అంటూ ఇమ్మాన్యూల్ కామెడీగా వార్నింగ్ ఇస్తున్నాడు. 

36

ఇక హైపర్ ఆది, రాకెట్ రాఘవ తన గ్యాంగ్ తో హాకీ స్టిక్స్ చేత పట్టుకుని రంగంలోకి దిగారు. హైపర్ ఆది ఆపోజిట్ గ్యాంగ్ పై తనదైన శైలిలో వరుసగా పంచ్ డైలాగ్స్ పేల్చాడు. మధ్యలో బుల్లెట్ భాస్కర్ కల్పించుకుని.. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఎందుకు రష్మీ.. పద వెళదాం.. నీ పేమెంట్ నేను ఇంటికి పంపిస్తా అని బీరాలు పలుకుతూ చెబుతాడు. 

46

బులెట్ భాస్కర్ కి హైపర్ ఆది ఇచ్చిన కౌంటర్ కౌంటర్ అదిరిపోయింది. నువ్వు రష్మీకి రెమ్యునరేషన్ ఇవ్వాలంటే 100 పెద్దమనిషి ఫంక్షన్స్ చేసినా సరిపోదు అంటూ కామెంట్స్ చేశాడు. దీనితో అక్కడున్న వారంతా నవ్వేశారు. 

56

అనంతరం రాకెట్ రాఘవ చేసిన లేడీ గెటప్ ఆకట్టుకుంది. ఆ తర్వాత నూకరాజు చేసిన మహారాజుల స్కిట్ నవ్వులు పూయించే విధంగా ఉంది. నూకరాజు.. కమెడియన్ భద్రంపై వేసే ఫన్నీ సెటైర్లు బాగా పేలాయి. 

66

ఇది కేవలం ప్రోమో మాత్రమే కంప్లీట్ ఎపిసోడ్ అక్టోబర్ 20న ప్రసారం కానుంది. హైపర్ ఆది ఇటీవల కొంతకాలం జబర్దస్త్ నుంచి విరామం తీసుకున్నాడు. తిరిగి ఎంట్రీ ఇచ్చి కామెడీ పంచ్ లతో విరుచుకుపడుతున్నాడు. 

click me!

Recommended Stories