ఇంతలొనే మల్లికా ఏమీ తెలియనట్టుగా అక్కడికి వచ్చి ఏమైంది జానకి అని అనటంతో వెంటనే జానకి మల్లిక పై నీకు అసలు బుద్ది ఉందా మల్లిక నా రూమ్ లో ఉన్న పేపర్స్ ని నువ్వు ఎందుకు తీసావు అని అనడంతో మల్లిక కహానీలు చెబుతుంది. ఇంతలో అటుగా జ్ఞానాంబ, గోవిందరాజులు రావడం గమనించిన జానకి మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు మల్లిక మరింత రెచ్చిపోతూ జానకిపై లేనిపోని చాడీలు అని చెబుతుంది.