ఈరోజు ఎపిసోడ్లో జానకికి రింగు దొరకడంతో ఆ రింగు ఎవరిదో తెలుసుకోవడానికి గోల్డ్ షాప్ ల దగ్గరికి వెళుతుంది. అప్పుడు ఆ షాపు అతను ఇలా కస్టమర్స్ డీటెయిల్స్ చెప్పడం మంచిది కాదు నా దగ్గర గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అందరూ ఆర్డర్స్ వేసి మరి బంగారు తీసుకుంటారు ఇలా చెప్పలేనమ్మ నన్ను క్షమించు అని అంటాడు. లేదండి నేను కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ అని ట్రైనింగ్ లో భాగంగా ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఈ ఉంగరం ఎవరిదో తెలుసుకోవాల్సి ఉంది అని అంటుంది జానకి. నేను వేరే ఊరి నుంచి వచ్చాను ఇలా చేస్తే నా వ్యాపారం దెబ్బ తింటుంది దయచేసి అర్థం చేసుకోండి అని అంటాడు అతను.