రష్యా తరపున ఉక్రెయిన్ పై యుద్దానికి వెళుతున్నావా?... పవన్ 'వారాహి' పై ఓ రేంజ్ లో ట్రోలింగ్!

First Published Dec 8, 2022, 11:53 AM IST

పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సిద్ధం అవుతున్నారు. దీని కోసం వారాహి పేరుతో ప్రత్యేక వాహనం సిద్ధం చేశారు.  ఒక ప్రేమో కూడా వదిలారు. సదరు ప్రోమో ఓ రేంజ్ లో ట్రోల్ కి గురవుతుంది.

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు దేశభక్తుడిగా అభివర్ణిస్తారు. సామాజిక వాదిగా, మానవతా మూర్తిగా కొలుస్తారు. అలాఅని ఆయనేమైనా సోషలిస్టా, హ్యూమనిస్టా లేక సోషల్ మూమెంట్స్ లో పాల్గొన్నాడా?... ఏమీ లేదు. కంటెంట్ తో సంబంధం లేకుండా తన సినిమాల్లో ఒక దేశభక్తి గీతం పెట్టుకునేవాడు. చేగువేరా గెటప్ లు వేసి బ్యాక్ గ్రౌండ్ లో ఆయన ఫోటోలు పెట్టేవాడు. మదర్ థెరిస్సా, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఫోటోలు వాడుకునేవాడు. 
 


ఆ విధంగా ఆయన దేశభక్తుడు అయ్యాడు. నాకు సోషలిస్ట్ చేగువేరా స్ఫూర్తి అంటూ మతతత్త్వ బీజేపీ పార్టీతో దోస్తీ చేస్తాడు. అన్నీ పార్టీలతో కలిసే జనసేనకు ప్రత్యేక భావజాలం లేకుండా పోయింది. దీంతో ఆ పార్టీ సిద్ధాంతం తెలియని జనాలకు, ఏపీలో రాజకీయ పార్టీలు అంటే వైసీపీ, టీడీపీనే. జనసేన ప్రత్యమ్నాయం కాలేకపోతుంది. 

Pawan Kalyan

కాగా అక్టోబర్ 5న పవన్ బస్సు యాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. యాత్ర మొదలు పెడితే కనీసం ఏడాది సమయం పడుతుంది. మరోవైపు హరిహర వీరమల్లు షూట్ మధ్యలో ఉంది. నిర్మాతలు ఒత్తిడి చేయడంతో బస్సు యాత్ర వాయిదా వేశాడు. సినిమాల కోసం యాత్ర వాయిదా అంటే జనాలు నవ్వుతారు. కాబట్టి ప్రజల సమస్యలపై లోతైన అవగాహన కోసమే వాయిదా అన్నారు. హరి హర వీరమల్లు సెట్స్ లో గత నెల రోజులుగా ప్రజా సమస్యలపై తీరిక లేకుండా పవన్ అధ్యయనం చేస్తున్నారు. 

హరి హర వీరమల్లు షూట్ పూర్తి కాగానే బస్సు యాత్ర షురూ చేయనున్నాడు. దీని కోసం ప్రత్యేకంగా ఒక వాహనం సిద్ధం చేశారు. ఆ బస్సు డిజైన్ లో సినిమా తెలివితేటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తనని జనాలు సైనికుడు అనుకోవాలి దాని కోసం ఆర్మీ గ్రీన్ కలర్ వేయించాడు. డిజైన్ కూడా సైన్యం వాడే వాహనాన్ని పోలి ఉండేలా చూసుకున్నాడు. ఇదంతా ఒక ఆర్ట్ డైరెక్టర్ చూసుకున్నాడు.

Pawan Kalyan

ఆ వాహనానికి వారాహి అని టైటిల్ పెట్టి...  ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్ కూడా వదిలాడు. తలపాగాలు ధరించి ఇద్దరు సిక్కులు ముందు నడుస్తుంటే, సిబ్బంది ఆ వాహనాన్ని ఫాలో అవుతున్నారు. పూర్తి సినిమాటిక్ స్టైల్ లో ఉన్న వారాహి టీజర్ అదిరిపోయింది. ఈ ఐడియాలు ఖచ్చితంగా గురూజీ త్రివిక్రమ్ వే. అందులో ఎలాంటి సందేహం లేదు. 

Pawan Kalyan

పార్టీ పెట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్ చదివే త్రివిక్రమ్ స్క్రిప్ట్స్ విని జనసైనికులకే విసుగొచ్చేసింది. సాధారణ జనాలైతే ఈ సినిమా డైలాగ్స్, హీరోయిజం సిల్వర్ స్క్రీన్ వరకు ఓకే, రాజకీయాల్లో పనిచేయవని చెప్పేశారు. 2019 ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనం. పవన్ మాత్రం ఆ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలే ఫాలో అవుతున్నాడు. 
 

Pawan Kalyan


ఇక వారాహి వాహనం డిజైన్, పరిచయం చేసిన వీడియో చూసిన సోషల్ మీడియా జనాలు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఎలివేషన్స్ వదలవా పవన్ అంటూ ఏకిపారేస్తున్నారు. కొందరైతే రష్యా తరపున ఉక్రెయిన్ పై యుద్దానికి వెళుతున్నావా ? అంటూ విమర్శిస్తున్నారు. 
 

Pawan Kalyan - sujeeth movie


అయితే పవన్ అభిమానులకు వాహనం విపరీతంగా నచ్చేసింది. ఇక ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళే అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. మరి పవన్ బస్సు యాత్ర ఏ స్థాయిలో సక్సెస్ కానుందో చూడాలి. ఎన్నికలకు మరో 15 నెలల సమయం మాత్రమే ఉంది. ఒకవైపు సుజీత్ తో కొత్త మూవీ ప్రకటన చేశారు. మరి ఆయన కార్యాచరణ ఏమిటో జనసైనికులకు కూడా పెద్ద చిక్కు ప్రశ్న. 

click me!