ఈ రోజు ఎపిసోడ్ లో అఖిల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత అతను ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇన్ఫోర్మ్ చేస్తాము అని అంటాడు. ఆ తర్వాత అఖిల్ బయటకు వెళ్తాడు. అప్పుడు రామచంద్ర అక్కడే ఉండి ఎందుకు అఖిల్ దిగులుగా కనిపిస్తున్నాడు ఉద్యోగం రాలేదా,చరణ్ కి అఖిల్ నా తమ్ముడు అని తెలియదు కదా అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రామచంద్ర, తన ఫ్రెండ్ చరణ్ కోసం లోపలికి వెళ్తుండగా ఒక అతను లోపలికి వెళ్లకుండా అడ్డుకుండడంతో అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని అంటాడు. అప్పుడు చరణ్ గొప్పగా మాట్లాడడంతో రామచంద్ర పొగుడుతూ ఉంటాడు.