ఈరోజు ఎపిసోడ్ లో వేద స్నానం చేసి రెడీ అవుతూ ఉండగా ఇంతలో అక్కడికి యష్ రావడంతో వారిద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ అలాగే ఉండిపోతారు. అప్పుడు యష్ వేద వైపు చూస్తూ షర్ట్ బటన్స్ తప్పుగా పెట్టుకుంటూ ఉంటాడు. అది వేద చూస్తూ ఉంటుంది. అప్పుడు వేద యష్ షర్ట్ బటన్స్ విప్పి సరిచేస్తుంది. అప్పుడు యష్ నా మీద ఫుల్ కోపంగా ఉంది అయినప్పటికీ నన్ను గమనిస్తూ చేయాల్సినవని చేస్తూ ఉంటుంది అని నవ్వుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అందరు భార్యలు ఇలాగే ఉంటారా లేకపోతే నా భార్య ఇలాగే ఉంటుందా అనుకుంటూ తన కోట్ ను తిరగేసి వేసుకుంటూ ఉంటాడు.