ఇందులో భాగంగా మలయాళ బ్యూటీస్ కుప్పలు తెప్పలుగా టాలీవుడ్ లో దిగిపోతున్నారు. చాలా కాలం నుంచి కన్నడ ,మలయాళ అందాల జోరు టాలీవుడ్ లో కొనసాగుతోంది. దాంతో బడ్జెట్ పరంగా భారీ సినిమాలు .. పారితోషికం పరంగాను భారీతనమే చూపించే టాలీవుడ్ కి కొత్త హీరోయిన్స్ రాక పెరుగుతూనే పోతోంది. అందులో భాగంగానే ఇవాన అనే మాలీవుడ్ తార తెలుగు తెరపై బ్రేక్ కోసం ట్రై చేస్తోంది.