Ennenno Janmala Bandham: వేద కోసం బహుమతిని కొన్న ఖుషి.. షాపింగ్ మాల్ లో వేదను చూసేసిన మాళవిక!

Navya G   | Asianet News
Published : Feb 21, 2022, 12:24 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ తల్లి కూతుర్ల ప్రేమకు నిదర్శనం. ఈ సీరియల్ ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో షాపింగ్ మాల్ లో వేదన చూసిన మాళవిక ఏంటి ఇక్కడ అని అడగగా పెళ్లి షాపింగ్ కు వచ్చాను అంటుంది.

PREV
19
Ennenno Janmala Bandham: వేద కోసం బహుమతిని కొన్న ఖుషి.. షాపింగ్ మాల్ లో  వేదను చూసేసిన మాళవిక!

ఇక రెండు కుటుంబాలు గొడవ పడుతున్నట్టు నటిస్తూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. మాళవిక నీకు కాబోయే భర్త ఇక్కడ అని అడగగా పేద వాళ్ళ అక్క తొందర్లో యశోధర్ వైపు చూపిస్తుంది. ఏంటి ఈ యశోదర్ ఒకప్పుడు నన్ను గాలికి వదిలేసి కొత్త భార్య కోసం షాపింగ్ కి వచ్చాడా అంటూ తిట్టుకుంటూ ఉంటుంది.
 

29

మళ్లీ వేద వైపు చూసి ఎక్కడ నీకు కాబోయే భర్త అని అడుగుతుంది. ఈ లోపు వేద వల్ల బావ అక్కడికి రావడంతో అదిగో అతనే అని చూపిస్తుంది. దాంతో మాళవిక ఎంగేజ్మెంట్లో చూసింది ఇతనే కదా అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక  రెండు కుటుంబాల వారు సంతోషంతో చిందులేస్తూ ఉంటారు.
 

39

ఇక వేద బిల్ కట్టడానికి కౌంటర్ దగ్గరికి రాగా యశోధర్ ముందే తన క్రెడిట్ కార్డును ఇచ్చి వెళ్లి ఉంటాడు. ఇదంతా మాళవిక చూస్తూ వేదను తన వైపు తిప్పుకోవడానికి ఇదంతా చేస్తున్నాడని అందుకే వేద బిల్లును కూడా తనే కట్టడానికి క్రెడిట్ కార్డు ఇచ్చాడా అని అనుకుంటుంది.
 

49

మాళవిక,వేద దగ్గరకు వెళ్లి డబ్బు ఉన్న వాళ్లకి పొగరు ఎక్కువ , ఏదైనా చేస్తారు అంటూ యశోదర్ ని తిడుతూ ఉంటుంది. వేద కూడా అవును డబ్బు ఉన్న వాళ్లకి పొగరెక్కువ, ఏదైనా సాధించాలి అనుకుంటారు. కానీ నేను మాత్రం డబ్బుకు అమ్ముడుపోను నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. అని మాళవికకు బుద్ధి చెబుతుంది.
 

59

ఖుషి వేద పెళ్లి కోసం ఒక బహుమతిని కొనాలి అని తన కిడ్డీ బ్యాంక్ ను పగలగొట్టి ఆ డబ్బు తో బహుమతి కొంటుంది. ఆ బహుమతి ఏంటంటే వరల్డ్స్ బెస్ట్ మామ్ ట్రోఫీ కొని వేద దగ్గరకు వెళుతుంది. ఇదంతా అక్కడే ఉన్న తార చూసి మాళవిక కు ఫోన్ చేసి చెప్పాలనుకుంటుంది.
 

69

వేద సంగీత్ పార్టీ కోసం రెడీ అవుతూ ఉంటుంది. ఖుషి అక్కడికి రావడంతో ఖుషి ని  చూసిన వేద సంతోషంలో ఖుషి ని  ఎత్తుకొని తిప్పుతుంది. ఖుషి అమ్మ నీకోసం ఒక బహుమతి ని తీసుకు వచ్చాను కళ్ళు మూసుకో అని చెప్తుంది.
 

79

ఈ లోపు మాళవిక ను చూపిస్తారు తార మాళవిక కు జరిగిన  విషయాన్ని చెప్తుంది. దాంతో మాళవిక ఖుషి తన కోసమే బహుమతి  తీసుకుంది అని  నన్ను అమ్మగా ఒప్పుకుంది అని సంతోష పడుతూ ఉంటుంది ఈ విషయాన్ని అభిమన్యు కి చెప్పాలి అని అనుకుంటుంది.
 

89

ఇక వేద కోసం ఖుషి తీసుకువచ్చిన బహుమతిని వేదకు ఇస్తుంది. వేద వరల్డ్స్ బెస్ట్ మామ్ ట్రోఫీని చూసి ఆనందంతో ఏడుస్తూ ఖుషిని హత్తుకుంటుంది. ఈ సీన్ ఐతే ఎమోషనల్ గా ప్రేక్షకుల మనసును కదిలించేస్తుంది.
 

99

వేద, యశోధర్ లు సంగీత్ పార్టీలో డాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన మాళవిక వేద, యశోధర్ లను చూసి పెళ్లి చేసుకోబోయేది వీరిద్దరె అని తెలుసుకుని షాక్ అవుతుంది. మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాల్సిందే.

click me!

Recommended Stories