
ఈరోజు ఎపిసోడ్లో యష్ నిద్ర లేవగా అప్పుడు వేద ఖుషి నీ స్కూల్ కి రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడు వేద ఖుషి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెబుతావా అని అనగా చెప్పమ్మా అనటంతో అబద్ధాలు చెప్పవచ్చా అని అడగగా చెప్పకూడదు అని అంటుంది ఖుషి. మోసం చేయవచ్చా అని అడగగా చేయకూడదు అని అంటుంది ఖుషీ. చిన్నపిల్ల అయినా నీకు తెలుసు కానీ ఉండాల్సిన వాళ్లకు లేవే అని ఉద్దేశించి అంటుంది వేద. సొంత వాళ్ళను నమ్మించి మోసం చేయకూడదని తెలియదా అని అంటుంది. మరొకవైపు సులోచన యాక్సిడెంట్ విషయం తలుచుకుని బెడ్ పైనుంచి కిందకు పడిపోవడంతో ఇంతలో చిత్ర అక్కడికి వచ్చి సులోచనను బెడ్ పై పడుకోబెట్టి వెళ్ళి వేద ను పిలుచుకుని వస్తుంది. అప్పుడు వేద అమ్మ ఏమైంది అమ్మ ఏం జరిగింది అమ్మ అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
అప్పుడు వేద వాళ్ళ నాన్న మీ అమ్మ నిద్రలో నుంచి కింద పడిపోయింది అని చెబుతాడు. అప్పుడు అతను నీ గురించి మీ అమ్మ ఈ మధ్య నీకోసం ఎక్కువగా బాధపడుతుంది ఎక్కువగా టెన్షన్ పడుతోంది అని చెబుతూ బాధపడంతో వేద కూడా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వేద నువ్వు ఉండంగా నాకేం కాదమ్మా అని ఎమోషనల్ అవుతూ సులోచనకు ధైర్యం చెబుతుంది. ఇంతలోనే డాక్టర్ అక్కడికి వస్తుంది. అప్పుడు బీపీ ఎక్కువ అయ్యింది బాగానే ఉంది అనడంతో వెంటనే వేద డాక్టర్ని పక్కకు పిలుచుకొని వెళ్లి అమ్మ పరిస్థితి ఎలా ఉంది అని అడగగా యాక్సిడెంట్ షాక్ నుంచి మీ అమ్మ ఇంకా పూర్తిగా కోల్పోలేదు వేద అని చెప్పడంతో వేద బాధపడుతూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి వేద అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వేద ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
అప్పుడు అమ్మకి యాక్సిడెంట్ చేసిన ఆ మాళవికను ఎట్టి పరిస్థితులలోను వదిలిపెట్టకూడదు అనుకుంటూ ఉంటుంది వేద. మరొకవైపు మాళవిక ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. వేద ఏమైనా గొడవ చేసి ఉంటుందా యష్ ని అడిగితే బాగుంటుంది అని యష్ కి కాల్ చేయగా యష్ ఫోన్ పని చేయకపోవడంతో ఆమె టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి అభి వస్తాడు. అప్పుడు అభి ఏం జరిగింది బంగారం అని అనడంతో ఇదంతా నీ వల్లే జరిగింది అభి అని అనగా ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తాడో లేకపోతే ఆ వేదకు సపోర్ట్ చేస్తాడో ఇప్పుడే తెలిసిపోతుంది కదా బంగారం అని అంటాడు. అప్పుడు కైలాష్ నాకైతే యష్ ఆ వేదకే సపోర్ట్ చేస్తాడని అనిపిస్తోంది అనటంతో నా బంగారాన్ని చూసుకోవడానికి నేను ఉన్నాను ఈగ కూడా వాలనివ్వను అని అంటాడు అభి.
అప్పుడు మాళవిక నా ధైర్యం స్ట్రెంత్ అని నా కొడుకు ఆదిత్య ఆదిత్య అంటే ఆ యష్ పంచప్రాణాలు వాడిని అడ్డుపెట్టుకొని ఏమైనా చేయొచ్చు అని అంటుంది. అప్పుడు ఆదిత్యను ఎలా అయినా అడ్డం పెట్టుకొని యశోదర్ ని బ్లాక్ మెయిల్ చేయాలి అనుకుంటూ ఉంటుంది మాళవిక. మరొకవైపు వేద డాక్టర్ అన్న మాటలు తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి మాలిని వస్తుంది. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే యష్ అక్కడికి వచ్చి వారి మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు మాలిని సమస్యలు అన్ని తీరిపోయాయి సంతోషంగా ఉంటున్నాము అనుకునే లోపే మన రెండు ఫ్యామిలీలకు ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది అని బాధగా మాట్లాడుతుంది.
దీనికి అంతటికి కారణం ఆ యాక్సిడెంట్ చేసిన మనిషి ఎట్టి పరిస్థితులలోనూ నువ్వు ఆ మనిషిని వదిలిపెట్టకు వేదా నీకు అండగా మన కుటుంబం ఉంటుంది. ఎట్టి పరిస్థితులలోనూ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే అనటంతో షాక్ అవుతాడు. అప్పుడు మాలిని అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత వేద ఎలా అయినా మాళవికను ఊచలు లెక్కపెట్టేలా చేయాలి మీరు నన్ను ఇంతగా నమ్ముతున్నారు అత్తయ్య కానీ అసలు విషయం మీ దగ్గర దాస్తున్నాను నన్ను క్షమించండి అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు యష్ వింటూ ఉంటాడు. తర్వాత లాయర్ ఝాన్సీ వేదను కలవడం కోసం వస్తుంది.
మరొకవైపు వేద హడావిడి చేస్తూ ఉండగా ఏం వేద అంత హడావిడి చేస్తున్నావని మాలిని అడగడంతో మన ఇంటికి ఝాన్సీ వస్తుంది అనడంతో ఇంతలోనే ఆమెఅక్కడికి రావడంతో మాలిని వాళ్ళని పరిచయం చేసి లోపలికి వెళ్తుంది వేద. అప్పుడు వేద లాయర్ కి కాఫీ తీసుకొని రాగా అక్కడికి యష్ వస్తాడు. అప్పుడు వేద కేసు గురించి లాయర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుండడంతో అది చూసి యష్ షాక్ అవుతాడు. అప్పుడు లాయర్ ఇదే కేసులో అవతలి తరపు నుంచి మీ హస్బెండ్ యష్ పోటీ చేస్తున్నాడు ఒకరకంగా చెప్పాలి అంటే నువ్వు మీ హస్బెండ్ తో పోటీ చేస్తున్నావ్ అని అనగా నేను మా హస్బెండ్ తో పోటీ చేయడం లేదు కేసు గెలవడం కోసం ప్రయత్నిస్తున్నాను అని అంటుంది వేద. ఆ తర్వాత టెన్షన్ పడిన యష్ లాయర్ కి ఫోన్ చేస్తాడు. అప్పుడు యష్ టెన్షన్ పడుతూ ఉండగా అతని లాయర్ యష్ కి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇప్పుడు యష్ లాయర్ తో మాట్లాడిన మాటలు అన్నీ మాలిని విని ఒక్కసారిగా షాక్ అవుతుంది.