టాలీవుడ్ లోకి మరో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ, మెగా హీరో జోడీగా మానుషి చిల్లర్

First Published | Nov 17, 2022, 11:52 AM IST

టాలీవుడ్ ఇండియన్ ఫిల్మ్ హబ్ గా మారింది. అన్ని భాషల ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి టాలీవుడ్ కు వలసలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతం మరో బీ టౌన్ తార.. సౌత్ ప్లైట్  ఎక్కడానికి రెడీగా ఉంది. 

టాలీవుడ్ లో ఇప్పటికే  బాలీవుడ్ నుంచి చాలా మంది తారలు సందడిచేస్తున్నారు. బాలీవుడ్ నుంచి మాత్రమే కాదు. తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి టాలీవుడ్  లక్ష్యంగా మూవ్ అవుతున్నారు. ఇక మనకు బాలీవుడ్ హీరోయిన్ల తాకిడి మొదటి నుంచీ ఉన్నదే.. ఇప్పుడు  మరో తార టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుంది. 
 

మరో బాలీవుడ్ బ్యూటీ తెలుగు తెరపై సందడి చేయబోతోంది. మెగా హీరో జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్ గా మానుషీ చిల్లర్ ను తీసుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. 


ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్  గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఓ సినిమా రూపొందించబోతున్నారు డైరెక్టర్ శక్తి ప్రతాప్‌ సింగ్‌.  ఈమూవీకి సబంధించిన ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక రెగ్యులర్ షూటింగ్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు టీమ్. ఇక ఇందులో భాగంగా.. హీరోయిన్ పాత్ర కోసం మానుషీని తీసుకోవాలని భావిస్తున్నారట టీమ్. 

ఇక మానుషీ చిల్లర్ దాదాపు అందరికి సుపరిచితురాలే.. 2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ… బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈబ్యూటీ.. తన అందంతో పాటు నటనలో కూడా టాలెంట్ చూపించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. 
 

ఇక  ప్రస్తుతం  బాలీవుడ్ లోనే గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ, టెహ్రాన్‌  అనే రెండు సినిమాల్లో నటిస్తోంది బ్యూటీ. ఈ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో మరికొన్ని ఆఫర్లు ఆమె గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక టాలీవుడ్ సినిమాకు ఆమె ఒకే అంటే.. ఇక్కడ కూడా వరుస ఆఫర్లు ఆమె గుమ్మం తొక్కే అవకాశం ఉంది. 

Latest Videos

click me!