Ennenno Janmala Bandham: యష్ కు కొడుకు ఉన్నాడంటూ బాంబు పెల్చిన మాళవిక.. పెళ్లి ఆపేసిన వేద!

Navya G   | Asianet News
Published : Mar 01, 2022, 01:00 PM IST

Ennenno Janmala Bandham: మాళవిక యశోదర్ గురించిన నిజాన్ని చెప్పి పెళ్లి అనేది పునర్జన్మ కావాలి ఆత్మహత్య కాకూడదు అని వేదను రెచ్చగొడుతుంది. ఇక వేద బాధపడుతూ యశోదర్ దగ్గరికి వెళుతుంది. యశోదర్ ను కాశి యాత్ర కు సిద్ధం చేస్తారు వేద ఫ్యామిలీ.

PREV
111
Ennenno Janmala Bandham: యష్ కు కొడుకు ఉన్నాడంటూ బాంబు పెల్చిన మాళవిక.. పెళ్లి ఆపేసిన వేద!

యశోదర్ తన ఫ్యామిలీ కాశి యాత్ర గురించి చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఇక యశోధర్ ఎవరికీ దొరకకుండా తెలివిగా అక్కడినుంచి పారిపోతాడు. వేద వల్ల నాన్న యశోధర్ వెనుక పరిగెడుతూ ఆగండి అల్లుడుగారు ఆయాసం వస్తుంది అనడంతో యశోధర్ ఆగిపోతాడు. వేద వాళ్ళ నాన్న యశోదర్ కాళ్ళు పట్టుకోబోతూ ఉంటాడు యశోదర్ మీరు ఇలా చేయకండి మీరు పెద్దవారు అంటాడు.
 

211

ఇక వేద వాళ్ళ నాన్న మీ కాశి యాత్ర విరమించుకుని మా అమ్మాయిని భార్యగా స్వీకరించండి అని అడుగుతాడు యశోధర్ కూడా ఒప్పుకొని వేద గురించి పొగుడుతాడు. ఇక పంతులుగారు వచ్చి పెళ్లికి ఒప్పుకొన్నట్లేనే అంటే యశోధర్ ఒప్పుకుంటున్నాను అంటాడు. వేద నేను ఒప్పుకోవట్లేదు అని అందరికీ షాక్ ఇస్తుంది.
 

311

మాళవిక వేద వెనుక నుంచి వచ్చి పక్కన నిలబడుతుంది మాళవిక ను చూసిన యశోదర్ తన ఫ్యామిలీ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక వేద యశోదర్ దగ్గరికి వచ్చి పెళ్లి జరగదు అని చెప్తుంది.యశోధర్ ను నువ్వు ఒక మోసగాడివి, స్వార్థపరుడువి, నన్ను ఎందుకు మోసం చేసావు అని నిలదీస్తూ ఉంటుంది.
 

411

యశోధర్ ఏం జరిగింది నేను ఏం చేశానో చెప్పు అంటాడు వేద నా దగ్గర  నిజాన్ని దాచి పెట్టావ్ అంటుంది. యశోధర్ నేనా అంటే అవును నువ్వే అంటుంది. సులోచన వచ్చి ఏం జరిగింది అంటూ అడుగుతుంది. వేద మనం మోసపోయాం,ఈ యశోదర్ ఫ్యామిలీ మనల్ని మోసం చేసింది అని అనడంతో రత్నం వచ్చి వేద కు సర్ది చెబుతూ ఉంటాడు.
 

511

మాలిని మాళవిక మీద కోపంతో అంత ఇదే చేసి ఉంటుంది వేద మనసును మార్చేసింది అని మాళవిక ను తిడుతూ ఉంటుంది. ఇక వేద యశోధర్ దాచిన నిజాన్ని చెబుతుంది. యశోదర్ కు ఖుషి మాత్రమే కాదు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు అనే నిజాన్ని చెబుతుంది దీంతో అందరూ షాక్ అవుతారు.
 

611

ఇక వేద ఇంత పెద్ద నిజాన్ని మా దగ్గర దాచి మమ్మల్ని పెళ్లికి ఒప్పించారు అని, మాళవిక దగ్గర పెరుగుతున్న యశోదర్ కొడుకు గురించి చెబుతుంది. దాంతో మాలిని ఈ మాళవిక కుట్ర చేస్తోంది ఇలా చేసే నా యశోదర్ కు కొడుకుని దూరం చేసింది అని బాధతో చెపుతూ ఉంటుంది.
 

711

ఇక మాళవిక వేద కు సపోర్ట్ చేస్తున్నట్టు మీరు వేదను మోసం చేశారు, వేద జీవితంతో ఆడుకోవాలని ప్రయత్నిస్తున్నారు అని అనడంతో మాలిని ఆవేశంతో మాళవికను తిడుతూ ఉంటుంది రత్నం మాలిని ని ఆపుతూ ఉంటాడు. యశోధర్, మాళవిక ను తిడుతూ మా మధ్యలో కి రావద్దు అని గొడవ పడుతూ ఉంటాడు. దాన్ని అవకాశంగా చేసుకున్న మాళవిక ఇదీ అతని క్యారెక్టర్ ఇతనితో కాపురం చేసిన వాళ్లు సంతోషంగా బతకలేరు అని యశోదర్ ను తిడుతుంది.
 

811

ఈ యశోదర్ కు భయపడి నా కొడుకును దూరంగా ఉంచి హాస్టల్ లో చదివిస్తున్నాను అని ఇప్పుడు నా కూతురు కోసం నేను చాలా తపన పడుతున్నాను అని చెబుతుంది దాంతో వేద నా మద్దతు కోర్టు బయట కోర్టు లోపల కూడా మీకే ఉంటుంది అని చెప్తుంది. దాంతో యశోదర్ షాక్ అవుతాడు.
 

911

రత్నం ఒకసారి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని చెబితే వేద పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం, నిజాయితీ ఉండాలి. ఆ రెండు మా ఇద్దరి మధ్య లేవు ఈ పెళ్ళి జరగదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మాళవిక పెళ్లి ఆపేశాను అని యశోధర్ ను అవమానిస్తూ మాట్లాడుతుంది.
 

1011

యశోదర్ ఫ్యామిలీ, వేద ఫ్యామిలీ పెళ్లి ఆగి పోయినందుకు బాధపడుతూ ఉంటారు. ఇక వేద, యశోదర్ ల మధ్య జరిగిన సంఘటనలు చూపిస్తారు. యష్ ఫ్యామిలీ వేద దగ్గరకు వస్తుంటారు. మాళవిక వాళ్ళని చూస్తూ నవ్వుకుంటూ వెళుతుంది. మాలిని  జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పి తప్పు చేసింది నా కొడుకు కాదు నేను అని జరిగిన విషయం  గురించి చెబుతుంది.
 

1111

యశోధర్ వేద కు తనకు ఖుషి మాత్రమే కాకుండా ఇంకోక కొడుకు కూడా ఉన్నాడు అన్న నిజాన్ని చెప్పాలి అని అనుకుంటాడు కానీ మాలిని యశోధర్ ను చెప్పనివ్వకుండా నేను చెప్తాను వేదకు అంటుంది. కానీ ఈ నిజం తెలిస్తే వేద పెళ్లికి ఒప్పుకోదేమో అని చేప్పి ఉండదు. అదే విషయాన్ని వేదకు చెప్తుంది మాలిని. ఇక పేద యశోధర్ లు పెళ్లి చేసుకుంటున్నట్టు చూపిస్తారు. మరి రానున్న ఎపిసోడ్లో జరగబోతుందో తెలుసుకోవాల్సిందే.

click me!

Recommended Stories