జాలీలాంటి చీరలో మాళవికా మోహనన్ నాభీ షో .. కొంగు పక్కకు జరిపి అందాలతో పిచ్చెక్కిస్తున్న ‘మాస్టర్’ భామ

First Published | Dec 2, 2023, 6:38 PM IST

‘మాస్టర్’ హీరోయిన్ మాళవిక మోహనన్ అందాల వరదలో నెటిజన్లను ముంచేస్తోంది. చీరకట్టులో పద్ధతిగానే దర్శనమిచ్చినా.. గ్లామర్ విందుతో మత్తెక్కిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమనే చెప్పాలి.
 

మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్ గా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే తమిళంలో ‘పేట’, ‘మాస్టర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం తమిళం, మలయాళంతో పాటు హిందీలోనూ అవకాశాలు అందుకుంటోంది. బాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న ‘యుద్ర’ అనే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్రలో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి. 


ఇదిలా ఉంటే.. మాళవికా సోషల్ మీడియాలో తరుచూగా తన అందమైన ఫొటోలను పంచుకుంటూ మైమరిపిస్తోంది. అందాల ప్రదర్శన చేసేలా అవుట్ ఫిట్లు ధరిస్తూ అదరగొడుతోంది. గ్లామర్ షోలో రోజుకోతీరు మెరుస్తూ మతులు చెడగొడుతోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రాన్స్ ఫరెంట్ శారీలో దర్శనమిచ్చింది. జాలీలాంటి చీరలో నడుము, నాభీ అందాలను చూపిస్తూ చూపు తిప్పుకోకుండా చేసింది. కొంగు పక్కకు జరిపి బిగుతైన బ్లౌజ్ లో అందాలను చూపిస్తూ మంత్రముగ్ధులను చేసింది. 

విరహ వేదనతో ఈ బ్యూటీ ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మాళవికా అందాల ధాటికి ఫిదా అవుతున్నారు. చీరకట్టులో మాళవిక మైండ్ బ్లోయింగ్ ఫోజులకు చూపు తిప్పుకోలేకపోతున్నారు. లైక్స్, కామెంట్లతో ఆ ఫొటోలను నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. 

కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ‘తంగళాన్’లో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే టాలీవుడ్ లో ప్రభాస్ - మారుతీ కాంబోలోని ‘రాజా డిలక్స్’ చిత్రంలోనూ ఆఫర్ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ మూవీ అఫిషీయల్ అనౌన్స్ మెంట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది.  
 

Latest Videos

click me!