Silk Smitha : 15 ఏళ్లకే పెళ్లి.. పేదరికం నుంచి స్టార్ స్టేటస్.. అలా నరకం.. స్కిల్ స్మిత లైఫ్ స్టోరీ తెలుసా?

First Published | Dec 2, 2023, 5:09 PM IST

సిల్క్ స్మిత పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. డాన్సర్ గా ఇండస్ట్రీలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. కానీ ఆమె లైఫ్ స్టోరీ గురించి ఎక్కువగా తెలిసి ఉండదు. చిన్న వయసులోనే సూసైడ్ చేసుకున్న ఆమె జీవితం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.
 

అందచందాలతో ఓ తరం కుర్రకారును ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత (Silk Smitha) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ రోజు ఆమె జయంతి కావడం విశేషం. 1960 డిసెంబర్ 2న చెన్నైలోని తెలుగు కుటుంబంలోనే జన్మించింది. ఆమె అసలు పేరు  విజయలక్ష్మి. ఆమె పేద కుటుంబంలో పుట్టింది. పెద్దగా చదువుకోలేకపోయింది. 
 

చిన్న వయస్సులోనే ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. 15 ఏళ్లకే సిల్క్ స్మిత ఇష్టం లేకుండానే పెళ్లిపీటలు ఎక్కింది. కట్టుకున్నవాడు నరకం చూపిస్తుండటంతో ఓ రోజు ఇంట్లో నుంచి పారిపోయింది. అక్కడి నుంచి తన ఫ్రెండ్ మేకప్ ఆర్టిస్ట్ ఇంటికి వెళ్లింది. అక్కడే కొద్దిరోజులు ఉందని టాక్. దాంతో నెమ్మదిగా స్నేహితుడితో కలిసి సినిమా సెట్స్ కూ వెళ్లడం ప్రారంభించింది. 


అలా మేకప్ ఆర్టిస్ట్ గానూ మారింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ ఆంథనీ ఈస్ట్ మ్యాన్ ఆమెకు మొదటిసారిగా సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారంట. ఆ తర్వాత తమిళ దర్శకుడు విను చక్రవర్తి సహాయంతో డాన్స్, యాక్టింగ్, ఇంగ్లీష్ నేర్చుకుంది. 1979లో వచ్చిన ‘వండిచక్కరం’ చిత్రంలో ‘స్కిల్’ పాత్ర పోషించింది. ఆ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. దాంతో స్కిల్ స్మితాగా పేరొందింది. 

17 ఏళ్లు పాటు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించి అలరించింది. ఈక్రమంలో జీవితంలో ఊహించని మలుపు చూసింది. పేద కుటుంబం నుంచి వచ్చి ఆమె స్టార్ స్టేటస్ దక్కించుకుని ఆశ్చర్యపరిచింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ తన డాన్స్ తో అదరగొట్టింది. మోహన్ లాల్, కమల్ హాసన్ లాంటి స్టార్లతో నటించి మెప్పించింది.
 

అయితే, సిల్క్ స్మిత 35 ఏళ్లలోనే చనిపోవడం బాధాకరం. తన చివరి రోజల్లో ఏర్పడిన పరిస్థితులతో నరకం చూసిందని ప్రచారం. ఆమె ఎవరికీ తెలియకుండా ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకుందని, ఆయన మాయలో పడి ఫిల్మ్ ప్రొడక్షన్ స్థాపించి... తన డబ్బు మొత్తం పోగొట్టుకుందంట. ఓ రకంగా ఆమె డబ్బును దోచేశారని కూడా అంటుంటారు.  
 

ఏదేమైనా లాస్డ్ డేస్ లో చాలా ఇబ్బంది పడిందంట. చివరికి 1996 సెప్టెంబర్ 23న స్కిల్ స్మిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో ఆమె సూసైడ్ నోట్ కూడా సంచలనంగా మారింది. ఏదేమైనా పేదరికం నుంచి వచ్చిన స్కిల్ స్మిత స్టార్ స్టేటస్ చూసి ఎందరో ఓరకంగా స్ఫూర్తినిచ్చారు.    

Latest Videos

click me!