బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన మాళవికా మోహనన్, ఏకంగా సల్మాన్ ఖాన్ తోనే...?క్లారిటీ ఇచ్చిన మాళవిక

Published : May 27, 2022, 02:56 PM IST

మలయాళ బ్యూటీ మాళవికా మోహన్ బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ తో ఆమె రొమాన్స్ చేయబోతున్నట్టు సమాచారం. ఇంతకీ మాళవిక ఏ సినిమాలో నటించబోతోంది..? ఇందులో నిజమెంత...?   

PREV
15
బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన మాళవికా మోహనన్, ఏకంగా సల్మాన్ ఖాన్ తోనే...?క్లారిటీ ఇచ్చిన మాళవిక

మాళవిక మోహన్ కు లక్కు లక్కలాగా అంటుకున్నట్టుంది. బాలీవుడ్ లో మంచి సినిమాలు చేయాలి అనుకుంటున్న బ్యూటీకి వెంటనే ఊహించని  ఆఫర్ తగిలినట్టు తెలుస్తోంది. ఏకంగా సల్మాణ్ ఖాన్ జోడీగా ఆమె నటించబోతున్నట్టు సామాచారం. దీనికి సంబంధించి సౌత్ లో రకరకాల మాటలు వినిపి్తున్నాయి. 

25

బాలీవుడ్  స్టార్ యాక్ట‌ర్ స‌ల్మాన్ ఖాన్  ప్ర‌స్తుతం ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ  డైరెక్ష‌న్‌లో క‌భీ ఈద్ క‌భీ దివాళి  సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈసినిమాలో.. సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ మాళవిక మోహ‌న‌న్ మ‌రో హీరోయిన్‌గా న‌టించ‌బోతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చింది మాళ‌విక‌.
 

35

స‌ల్మాన్ ఖాన్‌తో న‌టిస్తున్నార‌న్న వార్త ఫేక్ అని తేల్చి చెప్పేసింది. స‌ల్మాన్ ప్రాజెక్టు గురించి చాలా రాసుకొచ్చారు. కానీ తాను ఆ ప్రాజెక్టులో న‌టించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసి..పుకార్ల‌కు చెక్ పెట్టింది. అయితే సౌత్ లో తమిళ,మలయాళ సినిమాలు చేసిన బ్యూటీ తెలుగు డైరెక్ట్ సినిమా ఒక్కటి కూడా చేయలేదు ఇప్పటి వరకూ. డైరెక్ట్ గా బాలీవుడ్ ను టార్గెట్ చేసిందట. 
 

45

ఇక  తెలుగుపై కూడా శ్రద్ద పెంచింది బ్యూటీ.. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, టాలీవుడ్ డైరెక్ట‌ర్ మారుతి కాంబోలో రాబోతున్న సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం కానుంది మాళ‌విక మోహ‌న‌న్‌. టాలీవుడ్ లో ఆమె క్రేజ్ సాధిస్తే.. పక్కాగా స్టార్ హీరోయిన్ గా తన ఇమేజ్ పెరిగినట్టే అని చెప్పాలి. 
 

55

ఈ ఏడాది థ‌నుష్‌తో క‌లిసి మార‌న్ సినిమాలో మెరిసింది మాళ‌విక. ప్ర‌స్తుతం హిందీలో యుధ్ర సినిమా చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. అనున్న అన్ని అవకాశాలు రాకపోవడంతో నిరాశలో ఉంది బ్యూటీ.. ప్రభాస్ సినిమా వర్కౌట్ అయితే మాత్రం స్టార్ గా సెటిలవ్వచ్చు అనుకుంటుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories