కొత్త ప్రియుడి నుంచి భారీ కానుకలు అందుకున్న రాఖీ సావంత్, నక్కతోక తొక్కిన బాలీవుడ్ బ్యూటీ

Published : May 27, 2022, 01:37 PM IST

నక్కతోక తొక్కినట్టుంది బాలీవుడ్ శృగార తార రాఖీ సావంత్. ఇలా భర్తను వదిలేయగానే.. అలా కొత్త ప్రియడు దొరికాడు. అంతే కాదు రాఖీని దేవతలా చూసుకుంటున్నాడు. కోట్ల విలువ చేసే కానుకలు కూడా ఇచ్చాడు.   

PREV
18
కొత్త ప్రియుడి నుంచి భారీ కానుకలు అందుకున్న రాఖీ సావంత్,  నక్కతోక తొక్కిన బాలీవుడ్ బ్యూటీ

భర్త నుంచి విడిపోయిన కొన్ని నెలలకే రాఖీ మరో యువకుడితో ప్రేమలో పడింది. అదిల్ ఖాన్ దురాని అనే వ్యక్తితో రాఖీ సావంత్ ప్రస్తుతం గాఢంగా ప్రేమలో మునిగితేలుతోంది. అదిల్ తల్లీ తండ్రులు ఒప్పుకోకపోయినా.. ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నార. వాళ్లను ఒప్పించే పనిల్ ఉన్నారు. 
 

28

ఇక రీసెంట్ గా తన సంతోషాన్ని ప్యాన్స్ తో పంచుకుంది రాఖీ. తన బాయ్ ఫ్రెండ్ తనను ఎలా చూసుకుంటున్నాడో వివరించింది. తనకు ఎంత విలువిస్తున్నాడో.. తనను ఎంత సీరియస్ గా అతను ప్రేమిస్తున్నాడో చెప్పకుంది రాఖీ. 
 

38

రాఖీ సావంత్ రీసెంట్ గా ఆదిల్ కుటుంబ సభ్యులను కలిసేందుకు దుబాయ్ వెళ్లింది. తన బాయ్ ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ దుర్రాని తనకు విలువైన కానుకలు అందించి, తన ప్రేమ తెలియజేసినట్టు బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వెల్లడించింది. తమ రిలేషన్ షిప్ విషయంలో అతడు ఎంతో సీరియస్ గా ఉన్నట్టు ఆమె చెప్పింది. 
 

48

అయితే ఆమె మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఆదిల్ కుటుంబం తమ అనుబంధం పట్ల సానుకూలంగా లేరంటోంది. అయితే వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్ట వెల్లడించింది. అందుకోసమే ఆదిల్ సైతం తనను శరీరాన్ని నిండుగా కప్పివుంచే   డ్రెస్ వేసుకోవాలని కోరుతున్నట్టు రాఖీ సావంత్ వెల్లడించింది. 

58

రాఖీ సావంత్ హిందీ బిగ్ బాస్ సీజన్15 లో  తెగ సందడి చేసింది. ఆ తర్వాత నుంచి ఆమె  ఏదో ఒక వార్తల్లో ఉంటూనే ఉంది. గతంలో రితేష్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్న ఆమె.. తనను హిసిస్తున్నాడంటూ.. అతనిపై సంచలన ఆరోపణలు చేసింది.   రీసెంట్ గా విడిపోయి విడాకులు తీసుకుంది. 

68

కొత్త ప్రియుడు ఆదిల్ దుబాయిలో తన పేరిట ఇల్లు కొనుగోలు చేసినట్టు రాఖీ సావంత్  వెల్లడించింది. తర్వాతి రోజు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చినట్టు ప్రకటించింది. నిజం చెప్పాలంటే నేనంటే అతనికి ప్రేమ. అడడి ప్రేమ నిజమైనది. నా పట్ల అతడు ఎంతో సీరియస్ గా ఉన్నాడు. అని నమ్మకంతో ఉంది రాఖీ సావంత్. 

78

అంతే కాదు  ఏ వ్యక్తి ముందుగా ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెబుతాడు? ఆ పని తన ప్రియుడు  చేశాడంటూ గర్వంగా చెప్పుకుంటుంది. బెంగళూరుకు చెందిన ఆదిల్ రాఖీ సావంత్ కంటే ఆరేళ్లు చిన్న. రాఖీపై మనసు పడి ఆమెను అమితంగా ప్రేమిస్తున్నాడు. 

88

అయతే  ఇంతకీ వీరు పెళ్లి చేసుకుంటున్నారా.. లేదా ? అన్న విషయాన్ని రాఖీ సావంత్ స్పష్టం చేయలేదు. తమ రిలేషన్ షిప్ ను ఆదిల్ తల్లిదండ్రులు అర్థం చేసుకునేలా ట్రై చేస్తున్నారని... ఈ విషయంలో ఆదిల్ ఆంటీ కూడా ప్రయత్నం చేస్తున్నారని రాఖీ సావంత్ స్పస్టం చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories