మాళవిక మోహనన్ ఇంకా తెలుగు స్టైట్ మూవీ చేయలేదు. ఈ యంగ్ బ్యూటీ త్వరగా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని కుర్రకారు కోరుకుంటున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ అభిమానులు, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల అభిమానులంతా మాళవిక ఆమె అభిమాన హీరో చిత్రంలో నటించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి అందాల భామ తమ హీరో చిత్రంలో నటించాలనేది వారి బలమైన కోరిక.