Namita: శరత్ బాబుతో రిలేషన్, మ్యారేజ్ రూమర్స్.. మైండ్ డిస్ట్రబ్ అవుతోంది, నమిత భర్త కామెంట్స్

First Published | Jan 26, 2022, 5:08 PM IST

తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత. నమిత బొద్దుగా ఉన్నప్పటికీ విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ సొంతం చేసుకుంది. సిల్వర్ స్క్రీన్ పై హాట్ గా కనిపిస్తూ గ్లామర్ డాల్ గా మారింది.

తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత. నమిత బొద్దుగా ఉన్నప్పటికీ విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ సొంతం చేసుకుంది. సిల్వర్ స్క్రీన్ పై హాట్ గా కనిపిస్తూ గ్లామర్ డాల్ గా మారింది. తెలుగులో నటించింది తక్కువ చిత్రాల్లో అయినప్పటికీ తన అందంతో షేక్ చేసింది. బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో నమిత అందాలని కుర్రాళ్ళు మరచిపోలేరు. 

తమిళనాడులో అయితే నమిత కోసం అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు. నమిత క్రేజ్ ఎలాంటిదో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం నమిత..వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం అన్యోన్యంగా జీవిస్తున్నారు. సోషల్ మీడియాలో నమిత తరచుగా తన భర్తతో ఉన్న ఫోటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. 


చిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్ కి అయినా రూమర్స్ బెడద తప్పదు. నమిత కూడా అలాంటి రూమర్స్ ఎదుర్కొంది. నమిత సీనియర్ నటుడు శరత్ బాబుతో రిలేషన్ షిప్ లో ఉందని, వీరిద్దరూ మ్యారేజ్ కూడా చేసుకున్నారని చాలా కాలం క్రితమే పుకార్లు వినిపించాయి. అప్పట్లో ఈ జంట ఆ రూమర్స్ ని పట్టించుకోలేదు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నమితపై వచ్చిన రూమర్స్ పై ఆమె భర్త వీరేంద్ర స్పందించారు. నేను, నమిత చాలా సంతోషంగా ఉన్నాం. మా గురించి చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ బేస్ లెస్.. వాటిని విని నేను, నమిత నవ్వేసి ఊరుకుంటాం అని వీరేంద్ర అన్నారు. కానీ నమితని శరత్ బాబుతో లింక్ చేస్తూ మా మ్యారేజ్ టైంలో రూమర్స్ వచ్చాయి. అది మాత్రం మైండ్ కి డిస్ట్రబ్ గా అనిపించింది అని వీరేంద్ర అన్నారు. 

అలాంటి పుకార్లు సృష్టించడం చాలా తప్పు అని నమిత భర్త వీరేంద్ర అన్నారు. కాస్త డిస్ట్రబ్ గా అనిపించినప్పటికీ అలాంటి రూమర్స్ ని పట్టించుకోవలసిన అవసరం లేదు అని వీరేంద్ర అన్నారు. ఇక నమిత నటిగా డబ్బు డిమాండ్ చేయదు అని.. పాత్ర నచ్చితే చేస్తుంది అని తెలిపారు. 

తరచుగా నమిత, తన భర్తతో వీరేంద్రతో రొమాన్స్ లో మునిగితేలుతున్న ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇద్దరూ ముద్దులతో పరవశం అవుతున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కాస్త జోరు తగ్గినప్పటికీ నమిత నటన కొనసాగిస్తోంది. 

Latest Videos

click me!