తెల్లచీర కట్టిన మలయాళీ భామ.. వెలిగిపోయే అందంతో కట్టిపడేస్తున్న మాళవికా మోహనన్..

First Published | May 6, 2023, 5:27 PM IST

మలయాళీ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan) చీరకట్టులో దర్శనమిచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేసింది. 
 

మలయాళీ భామ మాళవికా మోహనన్ ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. తమిళ చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇతర భాషల్లోనూ నటించేందుకు ప్రయత్నిస్తోంది. అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. 
 

‘మాస్టర్’ చిత్రంలో విజయ్ దళపతి సరసన నటించిన మాళవికా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఆ చిత్రం తెలుగు వెర్షన్ లోనూ డబ్ కావడంతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది. పైగా మాళవికా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. 
 


తాజాగా  మాళవికా చీరకట్టులో దర్శనమిచ్చింది. సందప్రదాయ దుస్తుల్లో మలయాళీ భామ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత చీరకట్టులో మెరియడంతో అభిమానులతో పాటు నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. యంగ్ బ్యూటీ లుక్ ను కామెంట్లలో రూపంలో పొగుడుతున్నారు. 
 

తన ఫ్యాన్స్ కు నిత్యం సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటున్న మాళవికా ఇలా గ్లామర్ మెరుపులతోనూ కట్టిపడేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అందాలను ఆరబోస్తూ తెగ సందడి చేస్తోంది. మరోవైపు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ మరింత క్రేజ్ పెంచుకుంటోంది.
 

ఇక మాళవికా కోలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హిందీలోనూ ‘యుద్ర’ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ గురి టాలీవుడ్ పైనే ఉంది. గతంలో ఇదే విషయాన్ని తన ఫ్యాన్స్ తో చాట్ సెషన్ లో చెప్పింది. ఈ క్రమంలో నెట్టింట మరింత యాక్టివ్ గా కనిపస్తూ వస్తోంది.
 

టాలీవుడ్ నుంచి ఇప్పటికే మాళవికా భారీ ఆఫర్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది.  మారుతీ - ప్రభాస్ చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందని టాక్. ఇప్పటికే షూటింగ్ కూడా హాజరైందని అంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ‘తంగలాన్’లో చియాన్ విక్రమ్ సరసన నటిస్తోంది.
 

Latest Videos

click me!