బ్యూటీఫుల్ స్మైల్.. సంప్రదాయ దుస్తుల్లో మనస్సును దోచేస్తున్న మాళవికా మోహనన్.. పిక్స్

First Published | Sep 26, 2023, 8:24 PM IST

మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ ఇటీవల పద్ధతిగా మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. ట్రెడిషనల్ లుక్ లో కుర్ర హృదయాలను దోచుకుంటోంది. తాజాగా లెహంగా వోణీలో దర్శనమిచ్చి  ఆకట్టుకుంది.
 

కేరళ కుట్టి మాళవికా మోహనన్ (Malavaika Mohanan)  తొలుత మలయాళ చిత్రాలు ‘పట్టం పోలె’, ‘నిర్ణయాకమ్’ చిత్రాలతో వెండితెరపై మెరిసింది. అలాగే హిందీ, కన్నడలోనూ ఒక్క చిత్రం చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ లో అడుగుపెట్టింది.
 

రజినీకాంత్ ‘పేట’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘మాస్టర్’ చిత్రంతో మరింతగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ లోనూ విడుదల కావడంతో ఇక్కడి ఆడియెన్స్ ను కూడా తన నటనతో ఫిదా చేసింది.


అయితే, ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఫ్యాన్స్ తో చాట్ సెషన్ నిర్వహించిన సమయంలో తెలుగు సినిమాలో చేయాలనే తన కోరికను వ్యక్తం చేసింది. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ దక్కించుకున్నట్టూ తెలుస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఓ చిత్రంలో మాళవికా హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే మాళవికా పంట పండినట్టే అంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం మాళవికా మోహనన్  నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. నయా లుక్స్ తో అదరగొడుతోంది. ఎప్పుడూ ట్రెండీ అవుట్ ఫిట్లలో మెరిసే ఈ బ్యూటీ ఇటీవల ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. 
 

తాజాగా అట్రాక్టివ్ లెహంగా వోణీలో మెరిసింది. కొంటె ఫోజులతో మెస్మరైజ్ చేసింది. బ్యూటీఫుల్ స్మైల్ తో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మత్తు చూపులతో మైమరిపించింది. మొత్తానికి పద్ధతిగా దర్శనమిచ్చి చూపుతిప్పుకోకుండా చేసింది. ఇక మాళవికా నెక్ట్స్ చియాన్ విక్రమ్ ‘తంగళాన్’తో అలరించనుంది. ఆ తర్వాత ‘యుద్ర’ అనే హిందీ సినిమా కూడా రానుంది.

Latest Videos

click me!