Ennenno Janmala Bandham: వేదను అందరి ముందు ఇరికించిన మాళవిక.. అభిని కత్తితో పొడిచిన వసంత్?

Published : Jun 14, 2023, 11:31 AM IST

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి రేటింగ్ సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. కష్టంలో తనని చేరదీసిన తన సవతి జీవితంలో నిప్పులు పోయాలని చూస్తున్న ఒక ఆడదాని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Ennenno Janmala Bandham: వేదను అందరి ముందు ఇరికించిన మాళవిక.. అభిని కత్తితో పొడిచిన వసంత్?

ఎపిసోడ్ ప్రారంభంలో కన్నతల్లి కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నావు అలాంటి నీతో ప్రేమతో దగ్గర అవడం మానేసి ఎందుకు నీ మీద కేకలు వేస్తున్నాడు అంటూ ఆదిత్య దగ్గరికి వెళ్ళబోతాడు యష్. ఇప్పుడు మీరు తనని ఏమీ అనకండి ఇప్పటికే భయంతో ఉన్నాడు ఈ ఇంట్లో తన గెస్ట్ అనుకుంటున్నాడు మళ్లీ మీరు వెళ్లి ఏమైనా అంటే మరింత భయపడతాడు అంటూ భర్తకి సర్ది చెప్తుంది వేద.

29

కనక పోయినా నీలో కన్న ప్రేమని చూస్తున్నాను అంటాడు యష్. వాడు నాకన్న కొడుకే మీరు పదేపదే కన్న కొడుకు కాదు అనే విషయాన్ని గుర్తు చేయొద్దు అంటుంది వేద. ఈ మాటలు వింటున్న మాళవిక ఆదిత్య అలా రియాక్ట్ అవుతాడని నాకు తెలుసు అందుకే నిన్ను పంపించాను. ఈ ఇంట్లో నేను పొందలేని సుఖ సంతోషాలు నువ్వు కూడా పొందకూడదు అనుకుంటుంది మాళవిక.
 

39

ఆ తర్వాత వేద వెళ్లి వంట మనిషితో ఆదిత్య కోసం పాస్తా రెడీ చేయమని చెప్తుంది. సీన్ కట్ చేస్తే ఆదిత్య కి మెలకువ వచ్చేసరికి తడిగా ఉండడం గమనించి సిగ్గు పడిపోతాడు ఎంత వయసు వచ్చిన బెడ్తడిపేస్తున్నాడు అంటూ ఎవరైనా తిడతారేమో అని భయపడిపోతాడు. అసలే వేద ఆంటీ నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేయాలని చూస్తుంది అందుకే అసలు బెడ్ పాడు చేసినట్టు ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అనుకుని  ఆ బెడ్ షీట్ తీసుకెళ్లి ఉతికేస్తూ ఉంటాడు.
 

49

 ఇంతలో వేద బ్రష్, పేస్టు తీసుకొని వస్తుంది. బెడ్ మీద ఆదిత్య లేకపోవడం,బెడ్ నీట్ గా ఉండడం చూసి షాక్ అవుతుంది. ఆదిత్య బెడ్ ఇంత నీటుగా రెడీ చేసాడు అంటే బాగా మారిపోయినట్లుగా ఉన్నాడు ఇంతకీ ఆదిత్య ఏడి అంటూ చుట్టూ చూస్తూ బాత్రూం వైపు వెళ్తుంది. బెడ్ షీట్ వెతుకుతున్న ఆదిత్యను చూసి నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతుంది.
 

59

నేను ఈ ఇంట్లో గెస్ట్ ని నా పనులు నేను చేసుకుంటాను మీరేమీ నామీద జాలిపడక్కర్లేదు అంటూ రాష్ గా మాట్లాడుతాడు ఆదిత్య. బయటికి వచ్చిన ఆదిత్య దగ్గర బెడ్ షీట్ తీసుకొని పక్కన పెట్టి నువ్వు ఎందుకు అలా పరాయి వాడిలాగా మాట్లాడుతున్నావు ఇది కూడా నీ ఇల్లే నువ్వు వచ్చిన తరువాత నానమ్మ డాడీ వాళ్లు ఎంత సంతోషిస్తున్నారో తెలుసా మరి ఇప్పుడు ఇలా మాట్లాడొద్దు అంటుంది వేద.
 

69

మీరు నాకేమీ చెప్పక్కర్లేదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య. ఆదిత్య అలా వెళ్లిపోవటానికి చూసి ఏం జరిగింది అంటుంది మాలిని. మా వేద ఏదో అన్నట్లుగా ఉంది అంటుంది మాళవిక. తనని ఏమీ అనకూడదు మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తెచ్చుకోవటం చాలా కష్టం అంటుంది మాలిని. నేను తనని ఏమీ అనలేదు అంటూ ఏదో చెప్పబోతుంది వేద.
 

79

నువ్వేమీ సంజాయిషీ ఇచ్చుకో అక్కర్లేదు నువ్వు మందలించినా అది వాడి మంచి కోసమే అయి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యష్. ఆదిత్య ఇంట్లోంచి వెళ్ళిపోతే అది నీ వల్లే అన్నా చెడ్డ పేరు నీకు రాకూడదు అని చెప్పి వెళ్ళిపోతుంది మాలిని. వాళ్ల మాటలకు కన్నీరు పెట్టుకుంటుంది వేద. అది చూసి సంతోషిస్తుంది మాళవిక.

89

తర్వాత కొడుకు దగ్గరికి వెళ్లి ఎందుకు వేద ఆంటీ ని విసిగిస్తావు తన కోపం వచ్చిందంటే మన మీద చాడీలు చెప్పి మనల్ని ఇంట్లోంచి పంపించేస్తుంది. వేద ఆంటీకి దూరంగా ఉండు అని హెచ్చరిస్తుంది మాళవిక. మరోవైపు కళ్ళజోడు పెట్టుకొని నువ్వు ఎంత సన్నబడ్డావో చూస్తాను అంటూ ఆట పట్టిస్తున్న భర్త దగ్గర నుంచి ఆ కళ్ళజోడు లాక్కొని పెట్టుకుంటుంది వేద.ఈ కళ్ళజోడు లో ఏ మ్యాజిక్కు లేదు దీన్ని పట్టుకునా నన్ను రాత్రి నుంచి ఏడిపిస్తున్నారు అంటూ భర్తని ముద్దుగా విసుక్కుంటుంది. 

99

సీన్ కట్ చేస్తే సరదాగా మాట్లాడుకుంటున్న వసంత వాళ్ళ దగ్గరికి వచ్చి మర్యాదగా నీ భార్యని కేసు ఆఫర్ తీసుకోమని చెప్పు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు పైకి పోతారు అంటూ బెదిరిస్తాడు అభి. అప్పటివరకు నువ్వు బ్రతికి ఉంటే కదా అంటూ అభిని కత్తితో పొడిచేస్తాడు వసంత్. తరువాయి భాగంలో వేద దంపతులు ఇద్దరు క్లోజ్ గా ఉండడం చూసి భరించలేక పోతుంది మాళవిక. డోర్ కొట్టి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. కామన్ సెన్స్ లేదు అంటూ తిడతాడు యష్.

click me!

Recommended Stories