అర్జున్ కపూర్ తో బ్రేకప్, ఆమె వల్లేనా ? జాన్వీ కపూర్ ని అన్ ఫాలో చేసిన మలైకా అరోరా

First Published | Aug 26, 2023, 4:50 PM IST

మలైకా అందాలని ఎంత బోల్డ్ గా ఎక్స్ పోజ్ చేస్తుందో.. అంతే ఘాటుగా ఆమె ఎఫైర్ వ్యవహారాలు కూడా ఉంటాయి. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ అందరికి షాక్ ఇచ్చే అంశం.

బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. మలైకా అందాలని ఎంత బోల్డ్ గా ఎక్స్ పోజ్ చేస్తుందో.. అంతే ఘాటుగా ఆమె ఎఫైర్ వ్యవహారాలు కూడా ఉంటాయి. 

తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ అందరికి షాక్ ఇచ్చే అంశం. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. వీరిద్దరూ దాదాపు ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారనేది బాలీవుడ్ లో బహిరంగ రహస్యం. 


ప్రస్తుతం ఈ కుర్ర ముదురు ప్రేమికుల జంట బ్రేకప్ చేసుకున్నట్లు బిటౌన్ లో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోయారనేందుకు కొన్ని బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వార్తలు మొదలైన తర్వాత మలైకా.. అర్జున్ కపూర్ చెల్లెల్లు జాన్వీ కపూర్ తో సహా ఖుషి కపూర్, అన్షులా కపూర్ లని ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది. 

దీనితో అర్జున్ కపూర్, మలైకా బ్రేకప్ పై రూమర్స్ పెరిగాయి. దీనికి తోడు మరికొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ద్వారా అర్జున్ కపూర్ కి కుషా కపిలా అనే యువతితో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం ప్రేమగా మారి ప్రస్తుతం అర్జున్ ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Image: Instagram

ఆరేళ్ళ తర్వాత అర్జున్ కపూర్ తన గర్ల్ ఫ్రెండ్ ని మార్చినట్లు తెలుస్తోంది. కుషా కపిలా ఫ్యాషన్ ఎడిటర్ గా, యూట్యూబర్ గా గుర్తింపు పొందింది. మరో వైపు అర్జున్ కపూర్ మలైకా తో డేటింగ్ చేయడం అతడి ఫ్యామిలీకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ అడ్డు చెప్పలేక ఇంతకాలం ఎదురుచూశారట. ఇప్పుడు అర్జున్ కపూర్ కి కొత్త యువతి పరిచయం కావడంతో అతడి ఫ్యామిలీ మలైకా ని పూర్తిగా దూరం పెట్టే ఆలోచనలో ఉన్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. 

ఇవి కేవలం రూమర్స్ మత్త్రమేనా లేక నిజమో అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మలైకా అయితే అర్జున్ కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ ని ఒక్కొరికగా అన్ ఫాలో చేస్తోంది. అర్జున్ కపూర్ వయసు ప్రస్తుతం 38 ఏళ్ళు.. దీనితో పెళ్లి గురించి కుటుంబ సభ్యులు అతడిపై ఒత్తిడి పెంచుతున్నారట. కాబట్టి మలైకా కి గుడ్ బై చెప్పేశాడని అంటున్నారు. 

Latest Videos

click me!