గాండీవధారి అర్జున సినిమాపై ఎలాంటి హైప్ లేదు. దానికి తోడు ఫస్ట్ డేనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. వెరసి గాండీవధారి అర్జున కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. వరుణ్ తేజ్ కెరీర్లో గని డిజాస్టర్ అనుకుంటే ఆ చిత్ర ఫస్ట్ డే వసూళ్ళలో మూడో వంతు వసూళ్లు గాండీవధారి అర్జున చిత్రానికి దక్కాయి. గని ఫస్ట్ డే రూ. 3 కోట్ల షేర్ వసూలు చేసింది. కాగా గాండీవధారి వరల్డ్ వైడ్ షేర్ కేవలం కోటి రూపాయలు, అంతకంటే తక్కువగా నమోదైంది.
25
Gandeevadhari Arjuna Review
నైజాంలో గాండీవధారి అర్జున రూ. 60 లక్షల గ్రాస్ రాబట్టింది, ఆంధ్రాలో రూ. 65 లక్షలు, సీడెడ్ లో రూ. 15 లక్షల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఏపీ/తెలంగాణాలలో గాండీవధారి అర్జున రూ. 1.40 లక్షల గ్రాస్, రూ. 75 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక రెస్టాప్ ఇండియా, ఓవర్సీస్, కర్ణాటక కలుపుకుని ఫస్ట్ డే రూ. 50 లక్షల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గాండీవధారి అర్జున రూ.1.90 కోట్ల గ్రాస్ రూ. 1 కోటి షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
35
Gandeevadhari Arjuna Review
ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 17 కోట్లు కాగా రూ. 18 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్. ట్రెండ్ చూస్తుంటే అది అసాధ్యం అనిపిస్తుంది. సెకండ్ డే గాండీవధారి అర్జున చిత్ర వసూళ్లు మరింత దారుణంగా పడిపోయాయని సమాచారం. థియేట్రికల్ బిజినెస్ పక్కన పెడితే... దాదాపు రూ. 60 కోట్లతో గాండీవధారి అర్జున చిత్రం తెరకెక్కించారని సమాచారం. లండన్ లో చిత్రీకరించడం వలన అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయ్యిందని వరుణ్ తేజ్ అన్నారు.
45
ఈ క్రమంలో గాండీవధారి అర్జున భారీగా నష్టాలు మిగిల్చే సూచనలు కలవు. కథ, కథనంపై దృష్టి పెట్టకుండా దర్శకుడు కేవలం స్టైలిష్ మేకింగ్, రిచ్ విజువల్స్ పై దృష్టి పెట్టి సినిమా తీశాడన్న వాదన వినిపిస్తోంది. గరుడవేగ చిత్రంతో వచ్చిన ఫేమ్ ని ప్రవీణ్ సత్తారు ఘోస్ట్, గాండీవధారి చిత్రాలతో పోగొట్టుకున్నారు. సాలిడ్ హిట్ పడితే కానీ ఆయన కమ్ బ్యాక్ కాలేరు. మరోవైపు గాండీవధారి అర్జున వరుణ్ తేజ్ కెరీర్ ని ప్రమాదంలో పడేసింది. ఎఫ్2 అనంతరం వరుణ్ కి క్లీన్ హిట్ లేదు.
55
గాండీవధారి అర్జున చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్. నాజర్ కీలక రోల్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.