‘దుల్కర్ సల్మాన్ నే కాదు.. నన్నూ అలాగే టచ్ చేశారు’.! నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్..

First Published | Aug 26, 2023, 4:06 PM IST

అక్కడ టచ్ చేసి.. సారీ అక్క అన్నారు.. దుల్కర్ సల్మాన్ లాంటి ఘటనే నా జీవితంలోనూ జరిగిందంటూ.. సీనియర్ నటి కస్తూరి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేధు అనుభవాన్ని బయటపెట్టారు. 
 

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ  సినిమాలలో టాప్  హీరోయిన్ గా వెలుగు వెలిగింది సీనియర్ హీరోయిన్ కస్తూరి (Kasthuri) . ఈ క్రమంలో తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  నాగార్జున్ సరసన నటించిన ‘అన్నమయ్య’ చిత్రంతో ఇక్కడ మరిన్ని ఆఫర్లు అందుకుంది. 
 

ప్రస్తుతం వెండితెరపై కంటే.. బుల్లితెరపైనే సందడి చేస్తోంది. ఇంటింటి గృహలక్ష్మి చిత్రంతో టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. సోషల్ మీడియాలో అందాల రచ్చ చేయడంతో పాటు సూపర్ స్టైల్ గా కనిపించే ఈమె స్మాల్ స్క్రీన్ పై మాత్రం అమాయకంగా కనిపించి ప్రేక్షకుల మనస్సును దోచుకుంది. 


నెట్టింట యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే పలు ఇంటర్వ్యూలతోనూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ హాట్ టాపిక్ గ్గా మారుతుంటుంది. ఈ క్రమంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలో కస్తూరి జీవితంలో జరిగిన చేధు అనుభవాన్ని బయటపెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

అయితే, రీసెంట్ గా King of Kotha  మూవీ ప్రమోషన్స్ లో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)  ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఓ సందర్భంలో తను ఫ్యాన్స్ నుంచి ఎదుర్కొన్న ఘటను వివరించారు. ఓ మహిళా అభిమాని తనను అసభ్యకరంగా తాకిందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేశారు. 
 

దుల్కర్ సల్మాన్ లాంటి ఘటనే తన జీవితంలోనూ జరిగిందని ఆ చేధు అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ... గతంలో కోలీవుడ్ స్టార్స్ అసోసియేషన్ నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొన్నాను. అక్కడికి చాలా మంది అభిమానులు వచ్చారు. కార్యక్రమం ముగిసినా జనం తరలివచ్చారు. అదే సమయంలో ఎవరో నన్ను అసభ్యకరంగా తాకారు. 
 

వెనుక నుంచి నన్ను ఎవరో నొక్కినట్లు అనిపించింది. దాంతో వెంటనే నేను ఆ చేతిని పట్టుకొని ముందుకు లాగాను. అప్పుడు మా నాన్న కూడా నాతోనే ఉన్నారు. ఆ వ్యక్తి దొరికిపోవడంతో విపరీతంగా ఏడ్చాడు. ఏడుస్తూనే అక్కా సారీ.. సారీ అని చెప్పాడు. అలాంటి చెత్తపనులు చేసి ఏడ్వడం, సారీ చెప్పడం ఎందుకు’ అని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి. 

Latest Videos

click me!