తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ అర్భాజ్ ఖాన్ తో పెళ్లి గురించి స్పందించింది. త్వరగానే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం వల్ల కెరీర్ పై ప్రభావం పడిందా అని ప్రశ్నించగా మలైకా ఆసక్తికరంగా బదులిచ్చింది. పెళ్లి, పిల్లల్ని కనడం వల్ల నా కెరీర్ పై ఎలాంటి ప్రభావం పడలేదు. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం పూర్తిగా నా ఛాయిస్ తో జరిగింది. పిల్లల్ని కన్నంత మాత్రాన కెరీర్ పై ప్రభావం పడుతుంది అని భావించకూడదు. అందుకు నేనే ఉదాహరణ అంటూ మలైకా చెప్పుకొచ్చింది.