బాహుబలితో సౌత్ చిత్రాల పాన్ ఇండియా హవా మొదలైనప్పటి నుంచి బాలీవుడ్ కి షాక్ లు తప్పడం లేదు. అప్పటి వరకు ఇండియన్ సినిమాలో భారీ తనం, బలమైన కంటెంట్ అంటే బాలీవుడ్ సినిమాలే గుర్తుకు వచ్చేవి.
బాహుబలితో సౌత్ చిత్రాల పాన్ ఇండియా హవా మొదలైనప్పటి నుంచి బాలీవుడ్ కి షాక్ లు తప్పడం లేదు. అప్పటి వరకు ఇండియన్ సినిమాలో భారీ తనం, బలమైన కంటెంట్ అంటే బాలీవుడ్ సినిమాలే గుర్తుకు వచ్చేవి. కానీ బాహుబలి ఇచ్చిన ధైర్యంతో సౌత్ లో.. ముఖ్యంగా టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాలు పెరిగాయి. అంతేకాదు.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి.
27
Image: Still from the teaser
పుష్ప చిత్రం అందుకు ఉదాహరణ. పుష్ప చిత్రం బాలీవుడ్ లో 100 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ హీరోలు కొన్ని ఊహించని చిత్రాలతో దెబ్బై పోతున్నారు. ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచనలం సృష్టించిన ది కశ్మీర్ ఫైల్స్ మూవీ.. అక్షయ్ కుమార్ నటించిన బచ్చన్ పాండే చిత్రాన్ని మట్టి కరిపించింది. కశ్మీర్ ఫైల్స్ ప్రభంజనం ముందు ఆ చిత్రం నిలబడలేకపోయింది.
37
ఇప్పుడు ఎక్కడైనా కంటెంట్ కీలక పాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా సినిమాలకు మార్కెట్ పెరగడంతో బలమైన కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయి. కెజిఎఫ్ చిత్రం కూడా అలాగే బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తోంది.
47
Image: Still from the teaser
ఇప్పుడు సౌత్ నుంచి మరో మూవీ నార్త్ కి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది అని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. అది కూడా మన టాలీవుడ్ చిత్రమే. అడివి శేష్ నటించిన 'మేజర్' మూవీ హిందీలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జూన్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. అదే రోజున అక్షయ్ కుమార్ నటించిన భారీ చిత్రం పృథ్వి రాజ్ విడుదుల కానుంది.
57
Major Movie
వారియర్ కింగ్ పృథ్వి రాజ్ చౌహన్ చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చంద్ర ప్రకాష్ ద్వివేది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాధారణంగా ఇలాంటి చిత్రాలకు బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ పెట్టింది పేరు. పృథ్విరాజ్ చిత్ర ట్రైలర్ గమనిస్తే.. చరిత్రాత్మ చిత్రంలో ఉండాల్సిన మ్యాజిక్ కనిపించడం లేదు. ఎమోషనల్ గా లోపం కనిపిస్తోంది.
67
ఇక మేజర్ ట్రైలర్ తో అడివి శేష్.. స్టేడియం బయటకు సిక్సర్ కొట్టాడనే చెప్పాలి. ఈ చిత్రం 26/11 ముంబై దాడులలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు విడిచిన బ్రేవ్ సోల్జర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 26/11 ముంబై దాడుల గురించి నార్త్ ఆడియన్స్ కి బాగా తెలుసు. సో మేజర్ మూవీపై అక్కడి ఆడియన్స్ లో కూడా తప్పకుండా ఆసక్తి ఉంటుంది.
77
ఇక ట్రైలర్ లో ప్రతి షాట్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా హీరోయిక్ గా ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్ తరహాలోనే మేజర్ కూడా ప్రభంజనం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. స్వయంగా మహేష్ బాబు ఈ చిత్రాన్ని చూసి తాను చాలా ఎమోషనల్ అయ్యానని అన్నారు. కాబట్టి అడివి శేష్ మరోసారి బలమైన కంటెంట్ తో రాబోతున్నాడు. మేజర్, పృథ్వి రాజ్ రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవుతుండడంతో ఆసక్తి నెలకొంది. మరోసారి బాలీవుడ్ కి టాలీవుడ్ నుంచి షాక్ తప్పదా అనే చర్చ జరుగుతోంది.