Poorna : ఎర్రచీరలో ఘాటెక్కిన `అఖండ` భామ అందాలు.. పొట్టిబట్టలేసినా ఇంత హాట్‌గా ఉండదేమో!

Published : May 11, 2022, 10:27 AM ISTUpdated : May 11, 2022, 10:28 AM IST

హీరోయిన్‌ పూర్ణ అందాల గురించి నెటిజన్లకి తెలిసిందే. ఆమె హాట్‌నెస్‌ కి ఫిదా కానీ అభిమాని ఉండరు. అయితే ఆమె పొట్టి బట్టల్లో కంటే చీరలోనూ మరింతగా హాట్‌గా ఉంటుందంటారు. ఆమె కొత్త ఫోటోలు చూస్తే కచ్చితంగా అదే మాట చెప్తారనడంలో సందేహం లేదు. 

PREV
110
Poorna : ఎర్రచీరలో ఘాటెక్కిన `అఖండ` భామ అందాలు.. పొట్టిబట్టలేసినా ఇంత హాట్‌గా ఉండదేమో!

 `జబర్దస్త్`లో సందడి చేస్తున్న పూర్ణ లేటెస్ట్ గా చీరలో కనువిందు చేస్తుంది. ఎర్రచీరలో ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. ఫోటో షూట్‌ కోసం ఆమె ఎర్రచీరలో కనిపించింది. స్టూడియోలో తీసిన ఈ ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకోగా, అవి వైరల్‌ అవుతుంది. ఇందులో పూర్ణ పెట్టిన పోస్ట్ మరింత ఆకట్టుకుంటుంది. ఎప్పటికీ చీరపై ఉన్న ప్రేమ తగ్గదని పేర్కొంది పూర్ణ.  తనని, చీరని వేరుచేయలేరనే యాంగిల్‌లో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుంది.

210

ప్రస్తుతం పూర్ణ పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నాయి. చీరలో పూర్ణ అందాలు ఓవర్‌లోడ్‌ అయ్యాయని చెప్పొచ్చు. అయితే నెటిజన్లు మాత్రం తమ కామెంట్లకి పని చెప్పారు. ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తూనే, తమలోని రొమాంటిక్‌ యాంగిల్‌ని బయటకు తీస్తున్నారు. 
 

310

`పూర్ణ పొట్టిదుస్తులేసుకున్నా ఇంత హాట్‌గా ఉండదేమో` అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. దీంతోపాటు ఎర్రచీరలో పూర్ణ అందాలు ఘాటెక్కాయని, గుంటూరు మిర్చిన మించిన ఘాటు పూర్ణ అందాల సొంతమంటూ కవ్వితాలు రాస్తున్నారు. ఆమె ఫోటోలను పంచుకుంటూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్లో పూర్ణ హడావుడి మామూలుగా లేదని చెప్పొచ్చు. 

410

పూర్ణ టీవీ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యింది. ఆమె అంతకు ముందు సినిమాలతోనే ఆడియెన్స్‌ ని అలరించింది. హాట్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. అయితే సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోవడంతో ఈ అమ్మడి క్రేజ్‌ తగ్గిపోయింది. కేవలం చిన్న సినిమాలకే పరిమితమవుతూ వస్తోంది. 
 

510

అయితే ఈ క్రమంలో ఆమెకి ఈటీవీలో వచ్చే `ఢీ` డాన్సు షోలో వచ్చిన ఆఫర్‌తో పూర్ణ కి క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. `ఢీ` గత సీజన్‌కి పూర్ణ జడ్జ్ గా ఉంది. ఇందులో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఓ వైపు హైపర్‌ ఆదితో పంచ్‌లు, అప్పుడప్పుడు సుధీర్‌తో జోడీ కట్టి ఆమె చేసిన హంగామా ఆద్యంతం ఆకట్టుకుంది.

610

`ఢీ` లేటెస్ట్ సీజన్‌ నుంచి ఆమెని తీసేశారు. రెగ్యూలర్‌ అయిపోతుందనే ఉద్దేశంతో సుధీర్‌, రష్మి, దీపికా పిల్లితోపాటు పూర్ణని తొలగించారు. దీంతో కొంత గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో షోతో టీవీ ఆడియెన్స్ ని అలరిస్తుంది పూర్ణ. 

710

పూర్ణకి ఇటీవల `జబర్దస్త్` ఆఫర్‌ వచ్చింది. `జబర్దస్త్` నుంచి ఎమ్మెల్యే రోజా వెళ్లిపోయారు. ఆమెకి మంత్రి పదవి రావడంతో షో నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో ఆమె స్థానంలో పూర్ణ మెరుస్తుంది. ఓ వైపు ఇంద్రజతోపాటు పూర్ణ కూడా  జబర్దస్త్ లో సందడి చేస్తుంది. మళ్లీ బుల్లితెర ఆడియెన్స్ ని అలరిస్తుంది. 
 

810

పూర్ణ ఇటీవల`అఖండ` చిత్రంతో విజయాన్ని అందుకుంది. దీంతోపాటు ఆమె `దృశ్యం 2`లో గెస్ట్ రోల్‌లో మెరిసింది. అలాగే `తలైవి` చిత్రంతో శశిరేఖ పాత్రలో ఆకట్టుకుంది. భారీ సినిమాలు పడటంతో మళ్లీ పూర్ణకి పూర్వ వైభవం వచ్చిందని చెప్పొచ్చు. అయితే తనకు మరోసారి ఇంతటి క్రేజ్‌ రావడంలో, అవకాశాలు రావడంలో `ఢీ` షో ఎంతో ఉపయోగపడిందని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే `జబర్దస్త్` కూడా ఆమె కెరీర్‌కి మరింత హెల్ప్ కాబోతుందని భావిస్తుందట. 

910

పూర్ణ ప్రస్తుతం పలు చిన్న సినిమాల్లో నటిస్తుంది. బోల్డ్ రోల్స్ కి కేరాఫ్‌గా నిలిచే పూర్ణ చేతిలో ఇప్పుడు తెలుగులో `బ్యాక్‌ డోర్‌`తోపాటు మరో సినిమా చేస్తుంది. అలాగే తమిళంలో నాలుగు చిత్రాలు, మలయాళంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది పూర్ణ. అందులో భాగంగా `విసిథిరన్‌` త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే `పిశాచి 2`లో యాక్ట్ చేస్తుంది పూర్ణ. 

1010

హీరోయిన్‌ పూర్ణ హాట్‌నెస్‌ కి ఫిదా కానీ అభిమాని ఉండరు. అయితే ఆమె పొట్టి బట్టల్లో కంటే చీరలోనూ మరింతగా హాట్‌గా ఉంటుందంటారు. పూర్ణ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు చూస్తే కచ్చితంగా అదే మాట చెప్తారనడంలో సందేహం లేదు. రెడ్‌ శారీలో పిచ్చెక్కించేలా ఉంది పూర్ణ.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories