Guppedantha Manasu: జగతిని కన్నీళ్లు పెట్టించిన రిషి... నిన్ను కనడమే మా పాపం అంటూ విరుచుకుపడ్డ మహేంద్ర!

Published : Mar 09, 2022, 10:05 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha) సీరియల్ మంచి సక్సెస్ తో దూసుకుపోతుండగా.. రోజుకొ ట్విస్ట్ తో సీరియల్ టీఆర్పీ రేటింగ్ లో ముందుంది. అలాంటి ఈ సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Guppedantha Manasu: జగతిని కన్నీళ్లు పెట్టించిన రిషి... నిన్ను కనడమే మా పాపం అంటూ విరుచుకుపడ్డ మహేంద్ర!
Guppedantha Manasu

రిషి జగతి ను హర్ట్ చేసిన విషయం మహేంద్ర (Mahendra) కు తెలిసి జగతి చేసిన తప్పేంటి నిన్ను కనడమా అంటూ రిషి పై విరుచుకు పడతాడు. ఇక అదే క్రమంలో రిషి.. డాడ్ నేను విజ్ఞత విచక్షణ లేకుండా మాట్లాడలేదు అని అంటాడు. దాంతో మహేంద్ర (Mahendra) అంత మర్యాదగా అవమానించావా మీ అమ్మను అని అంటాడు.
 

26
Guppedantha Manasu

ఇక దాంతో రిషి (Rishi), నాకు అమ్మా అనే అదృష్టం లేదు అంటూ చెప్పుకోస్తాడు. అదే క్రమంలో మహేంద్ర (Mahendra).. ఇన్నాళ్లుగా నన్ను డాడ్ అని పిలవడం, ఆమెను మేడం అని పిలవడం ఈ ఒక్క పదం చాలదా ఆమె గుండె బద్దలవ్వడానికి అని అంటాడు. దాంతో రిషి (Rishi) వేరే స్థాయిలో స్టన్ అవుతాడు.
 

36
Guppedantha Manasu

ఇక వసు (Vasu), జగతి లు కార్లో వెళ్తూ ఉండగా వాళ్లకు దేవయాని ఎదురుపడి ఏంటి జగతి టైం కి తింటున్నావా? ఆరోగ్యం బాగుంటుందా అని వెటకారంగా గడ్డం పట్టుకొని అడుగుతుంది. దాంతో జగతి (Jagathi) చిరాకు పడుతుంది. ఇక వసు కూడా తనదైన స్టైల్ లో రియాక్ట్ అవుతుంది.
 

46
Guppedantha Manasu

ఇక దేవయాని (Devayani) రిషి నిన్ను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాడా? అని దెప్పిపొడుస్తుంది. ఇక వసు తల్లి కొడుకుల బంధాన్ని ఆ దేవుడు కూడా విడదీయలేదు అంటూ విరుచుకు పడుతుంది. ఇక ఈ క్రమంలో వసు (Vasu) దేవయానికి వేరే స్థాయిలో వార్ణింగ్ ఇచ్చి వెళుతుంది.
 

56
Guppedantha Manasu

మరోవైపు రిషి, మహేంద్ర (Mahendra) అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తాడు. ఇక జగతి, దేవాయని (Devayani) దెప్పి పొడిచిన మాటలు గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. ఈలోపు జగతికి వసు టీ తీసుకొని వస్తుంది.
 

66
Guppedantha Manasu

ఆ తర్వాత రిషి (Rishi).. మీ మేడం గారికి ఒక పని చెప్పాను అది ఎంతవరకు వచ్చిందొ అడుగు అని వసు తో అంటాడు. దాంతో వసు (Vasu) నేను ఎందుకు అడగాలి సార్ అంటూ మండిపడుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories