Guppedantha manasu: ఆనందంలో జగతి, మహేంద్ర.. దేవయానికి ఇన్‌డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన రిషీ!

First Published Aug 19, 2022, 10:30 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 19వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... జగతి ఆనందంతో రిషికి కాఫీ ఇస్తుంది. అప్పుడు రిషి  ఇంతకుముందు మీరు నాకు చాలా హెల్ప్ చేశారు థాంక్స్ అని అంటాడు. జగతి చాలా ఆనందపడుతుంది.రిషి వెళ్లిపోయిన తర్వాత మహీంద్రా అక్కడికి వచ్చి రిషి చెప్పిన మాటలు నేను విన్నాను. రిషి నీకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తాడని నేను అసలు అనుకోలేదు అని అంటాడు. జగతి ఆనందంతో ఏడ్చేస్తుంది. ఆ తర్వాత సీన్లో వసుధార ఆ ఉంగరం పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది.
 

రిషి సార్ నిజంగా V అనే అక్షరాన్ని నాకోసం రాయించారా? లేకపోతే పొరపాటున రాయించార? అయినా నేను సాక్షికి ముందే చెప్పాను. తను రిషి సర్ స్థాయికి చెందింది కాదని నా మాట వినలేదు. అయినా ఇక్కడ V అనే అక్షరం ఒంటరిగా ఉంటే బాగోదు కదా పక్కన R ఉంటే బాగుంటది R అంటే రిషి సార్ అప్పుడు బాగుంటాది. ఇప్పుడు ఉంగరం లో R  అక్షరం చేద్దామా దానికి డబ్బులు ఎక్కువ అవుతాయేమో డబ్బులు దాయడం మొదలు పెట్టాలి అని అనుకుంటుంది.
 

ఆ తర్వాత సీన్లో జగతి మహీంద్రా కాలేజీకి బయలుదేరాలనుకున్న సమయంలో మహేంద్ర కార్ పంచర్ అవుతుంది ఇద్దరు క్యాబ్ బుక్ చేసుకుందామనేలోగా రిషి అక్కడికి వచ్చి నేను లిఫ్ట్ ఇస్తాను అని అంటాడు. అప్పుడు రిషి నేను వెనకాతల కూర్చుంటాను మీరు డ్రైవ్ చేయండి అని అంటాడు. జగతి కార్ డ్రైవ్ చేస్తుంది ఆ తర్వాత సీన్లో వసు, నేను ఆటో ఎక్కితే ఉంగరం కొనడానికి డబ్బులు అయిపోతాయి.కనుక నేను డబ్బులు దాచుకోవడం మొదలు పెట్టాలి.
 

అవసరమైనప్పుడు తప్ప ఆటో ఎక్కకూడదు అని అనుకుంటుంది. ఈ లో ఆ కార్ అక్కడికి వస్తుంది.వసు ని చూసి జగతి కార్ ఆపుతుంది. మీరున్నారు ఏంటి మేడం రిషి సార్ ఎక్కడా అని అనగా  వెనకాతులు ఉన్నాడు అని అంటుంది జగతి. అప్పుడు వసు వెనకాతల ఎక్కుతుంది.మహేంద్ర, నేనే బండి డ్రైవ్ చేస్తాను నువ్వు దిగు జగతి,నాకు డ్రైవ్ చేయాలనున్నది ప్లీజ్ అని కార్ డ్రైవింగ్ తీసుకుంటాడు. డ్రైవింగ్ చేస్తున్న దారిలో కావాలని గట్టుకుల మధ్యలో ఆపుతాడు మహేంద్ర. దాని వలన వసు,రిషి గుద్దుకుంటూ ఉంటారు.
 

ఎందుకు ఇలా చేస్తున్నావు మహేంద్ర అని జగతి అనగా, చాలా సినిమాల్లో చూశాను ఇలా చేస్తే వాళ్ళు కలుస్తారేమో అని వర్క్ అవుట్ అవుతున్నట్టు ఉంది అని అనుకుంటాడు. మహేంద్ర, సారీ రిషి వర్షం పడింది కదా గతుకులు ఎక్కువ ఉన్నాయి అని కవర్ చేస్తారు.తర్వాత సీన్ లో వసు క్లాసులో కూర్చుని ఒక గ్రాముకి ఎంత పడుతుంది? ఎన్ని గ్రాములు కే ఉంగరం అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది.ఈ లోగ రిషి అక్కడికి వస్తాడు అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని అనగా వసు వేరే ఆలోచనలో ఉండిపోయి గుడ్ మార్నింగ్ చెప్పదు.
 

అప్పుడు రిషి వాసుదారులు లేపగా ఒక గ్రాము 4000 సార్ అని అంటుంది. గ్రామ్ ఏంటి అని రిషి అనగా గుడ్ మార్నింగ్ సర్, సారీ అని కూర్చుంటుంది. వసుధార ఎందుకు ఇలా ఉంది అని రిషి మనసులో అనుకుంటాడు.అప్పుడు రిషి ఒక సమ్ బోర్డు మీద చెప్తాడు. వసుధారా నువ్వు ఈ సుమ్ ని నేను చెప్పిన విధంగా బోర్డు మీద చేయగలవా? అని అంటే చేస్తాను సార్ అనే బోర్డు వైపు వెళ్తుంది వసుధార. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!