శ్రీదేవి నాకు మరో అమ్మ.. పిన్ని అతిలోక సుందరిని తలచుకుని `గులాబి` హీరోయిన్‌ మహేశ్వరీ ఎమోషనల్‌

Published : Sep 01, 2021, 05:10 PM ISTUpdated : Sep 01, 2021, 05:25 PM IST

ఒకప్పటి హీరోయిన్‌ మహేశ్వరి ఎమోషనల్‌ అయ్యింది. అతిలోకి సుందరి శ్రీదేవిని తలచుకుని సుమ ముందు భావోద్వేగానికి గురయ్యింది. తనకు అమ్మ తర్వాత అమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అందరిని భావోద్వేగానికి గురి చేసింది.

PREV
17
శ్రీదేవి నాకు మరో అమ్మ.. పిన్ని అతిలోక సుందరిని తలచుకుని `గులాబి` హీరోయిన్‌ మహేశ్వరీ ఎమోషనల్‌

మహేశ్వరి 1990-20లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. కృష్ణవంశీ `గులాబి` చిత్రంతో బాగా పాపులర్‌ అయ్యింది. `పెళ్లి`, `సూర్యవంశం`, `నీ కోసం`, `మా అన్నయ్య` చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకుంది. 
 

27

హీరోయిన్‌గా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నసమయంలోనే ఆమె సినిమాలకు బ్రేకిచ్చింది. 2000లో వచ్చిన `తిరుమల తిరుపతి వెంకటేశా` చిత్రం ఆమెకి చివరి సినిమా. ఆ తర్వాత టెలివిజన్‌పై ఫోకస్‌ పెట్టింది. కొన్ని టీవీ షోస్‌లో చేసిన మహేశ్వరీ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
 

37

చాలా రోజుల తర్వాత మహేశ్వరి టీవీ షోలో మెరిసింది. సుమ యాంకర్‌గా చేస్తున్న సక్సెస్‌ఫుల్‌ షో `క్యాష్‌`లో పాల్గొంది మహేష్‌. ఇందులో అలనాటి నటీమణులు రాశి, సదా, మహేష్‌, శ్రద్ధా దాస్‌లతో కలిసి సందడి చేసింది. 
 

47

సుమ చేసే అల్లరికి బలవుతూనే, తనదైన స్టయిల్‌లో కామెడీ చేసి అలరించింది. ముఖ్యంగా బౌ బౌ అంటూ ఆమె చెప్పిన డైలాగ్‌లు నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వారాంతం  ఎపిసోడ్‌ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది. ఇందులో తన పిన్ని శ్రీదేవి గురించి తలచుకుని మహేశ్వరి ఎమోషనల్‌ అయ్యింది. 

57

శ్రీదేవి తనకు రెండో అమ్మ అని చెప్పింది మహేశ్వరి. సుమ అడిగిన ప్రశ్నకి ఇలా స్పందిస్తూ ఎమోషనల్‌ అయ్యారు. షోని మొత్తం గుంబనంగా మార్చేశారు. ప్రస్తుతం ఈ సీన్‌ హైలైట్‌గా నిలుస్తుంది. శనివారం ఎపిసోడ్‌లోనూ హైలైట్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు. 
 

67

శ్రీదేవి అమ్మ రాజేశ్వరి ముందు భర్త రంగారావు ద్వారా పుట్టిన కూతురు సూర్యకళ. ఆమె మహేశ్వరికి తల్లి అవుతుంది. అలా వీరిద్దరి మధ్య రిలేషన్‌ ఉండింది. మహేశ్వరికి శ్రీదేవి పిన్ని వరుస అవుతుంది.

77

మహేశ్వరీ సినిమాలు మానేశాక హైదరాబాద్‌లో ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌గా కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఆ ఆఫీస్‌ ఓపెనింగ్‌ని శ్రీదేవినే ఓపెనింగ్‌ చేయడం విశేషం. చాలా రోజుల తర్వాత శ్రీదేవిని తలచుకుని మహేశ్వరీ ఎమోషనల్‌ అవ్వడం అందరిని ఆకట్టుకుంటుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories