మహేష్‌-రాజమౌళి మూవీ మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌.. హీరోయిన్‌ కన్ఫమ్‌?.. ఫ్యాన్స్ కి గూస్‌బంమ్స్..

First Published | Mar 7, 2022, 10:58 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చారు. హీరోయిన్‌ ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అయినట్టు తెలుస్తుంది. 

దర్శకుడు రాజమౌళి(Rajamouli) తన నెక్ట్స్ సినిమా మహేష్‌బాబు(Maheshbabu)తో ఉంటుందని తెలిపిన విషయం తెలిసిందే. పలు మార్లు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు రాజమౌళి తండ్రి, బిగ్‌ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ ప్రస్తుతం ఈ చిత్ర కథని సిద్ధం చేస్తున్నారు. స్క్రీన్‌ప్లే రాస్తున్నట్టు తెలుస్తుంది. అన్ని రకాలుగా ఈ చిత్ర కథని రెడీ చేస్తున్నారట. 
 

అయితే ఈ చిత్రం ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచర్‌ ఫిల్మ్ గా సాగుతుందని, ఇందులో మహేష్‌బాబు అడ్వెంచరర్‌గా కనిపిస్తారని సమాచారం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా సరికొత్త లుక్‌లో మహేష్‌ కనిపిస్తారట. స్టయిలీష్‌గా, మాస్‌గా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. ఇదే ఫ్యాన్స్ కి గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. దీనికితోడు వినిపిస్తున్న అప్‌డేట్లు మరింత రంజుగా మారుస్తున్నాయి. 


ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర ఉంటుందని, దానికి స్టార్‌ ఇమేజ్‌ ఉన్న యాక్టర్‌ని తీసుకోవాలని రాజమౌళి భావిస్తున్నారట. అయితే ఆ పాత్ర కోసం బాలయ్య(Balakrishna)ని పరిగణలోకి తీసుకున్నారట. ఆయనతో చర్చలు కూడా జరిగాయని టాక్‌. సినిమాకి ఆ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, కాకపోతే మహేష్‌తో సీన్లు ఉండవనే టాక్‌ వినిపిస్తుంది. ఏదేమైనా మహేష్‌ సినిమాలో బాలయ్య నటించబోతున్నారనే వార్త ఫ్యాన్స్ లో మరో రకమైన గూస్‌బంమ్స్ ని తెప్పిస్తున్నాయి. మరో రకంగా చెప్పాలంటే ఇది ఇద్దరు హీరోల అభిమానులకు పూనకాలు తెప్పించే వార్తే. 

దీనికితోడు మరో క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ కూడా కన్ఫమ్‌ అయ్యిందనే వార్త హల్ చల్‌ చేస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో సీత పాత్ర ద్వారా తెలుగు ఆడియెన్స్ కి పరిచయంకాబోతున్న అలియాభట్‌నే తీసుకుంటున్నారని టాక్‌. రాజమౌళి ఆలోచనల్లో అలియానే ఉందని, దీనికి సంబంధించిన చర్చ కూడా అలియాతో జరిగిందని టాక్‌. మరి ఇందులో నిజమెంతో గానీ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 
 

ప్రస్తుతం అలియాభట్‌(Alia Bhatt) `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR)లో నటిస్తుంది. అనంతరం ఎన్టీఆర్‌తో జోడీ కడుతుంది అలియా. కొరటాల శివ దర్శకత్వంలో తారక్‌ నటించే చిత్రంలో హీరోయిన్‌గా అలియా ఎంపికైంది. మరోవైపు మహేష్‌ చిత్రంలోనూ ఆమె పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఇక అలియాభట్‌ టాలీవుడ్‌కి పరిమితమై పోతుందేమో అని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఇక `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం మార్చి 25న విడుదల కానుంది. మరోవైపు ఇటీవల బాలీవుడ్‌లో `గంగూబాయి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చి విశ్వరూపంచూపించింది అలియా. దీంతోపాటు `డార్లింగ్స్`, `బ్రహ్మాస్త్ర` చిత్రాలు చేస్తుంది అలియా. రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి `రాఖీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ` చిత్రం చేస్తుంది అలియాభట్‌. 

ప్రస్తుతం మహేష్‌బాబు `సర్కారువారి పాట`లో నటిస్తున్నారు. ఇది మే 12న విడుదల కానుంది. మరోవైపు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇది త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ని జరుపుకోబోతుంది. అనంతరం రాజమౌళి సినిమా ఉండబోతుంది. మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌ అంటే సర్వత్రా ఆసక్తితోపాటు అంచనాలకు ఆకాశమే హద్దు కావడం విశేషం. 

Latest Videos

click me!