పిల్లల్ని ఎలా ప్రేమించాలో బహుశా నమ్రత-మహేష్ దంపతులను చూసి నేర్చుకోవాలేమో. కెరీర్, సంపాదన అంటూ బిడ్డల్ని నిర్లక్ష్యం చేసే పేరెంట్స్ మహేష్, నమ్రతలను స్ఫూర్తిగా తీసుకోవాలి. బిజీ లైఫ్ విషయానికి వస్తే... మహేష్ కంటే బిజీగా ఉండేది ఎవరో చెప్పండి. మనసుంటే మార్గం ఉంటుందన్నట్లు పిల్లల పట్ల బాధ్యత, ప్రేమ ఉన్నప్పుడు సమయం అదే దొరుకుతుంది. కేవలం ఆస్తులు సంపాదించి ఇవ్వడమే వారసులకు చేసే మేలని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు.