మహేష్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, చిరు, వెంకీ, విజయ్‌ దేవరకొండ.. డైరెక్టర్లకి షాక్‌ ఇచ్చిన స్టార్స్ !

First Published | May 31, 2021, 6:21 PM IST

చిరంజీవి, వెంకీ, మహేష్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ వంటి స్టార్‌ హీరోలు స్టార్‌ డైరెక్టర్లకి హ్యాండించారు. సినిమాలు చేస్తామని ప్రకటించి మరీ ఊహించని విధంగా మరో దర్శకుడితో సినిమాని ప్రకటించి షాక్‌ ఇచ్చారు.

ఎన్టీఆర్‌ తన ఎన్టీఆర్‌ 30 సినిమాని త్రివిక్రమ్‌తో ప్రకటించారు. ఇటీవల ఉన్నట్టుండి త్రివిక్రమ్‌కి షాక్‌ ఇచ్చి కొరటాలతో సినిమాని అనౌన్స్ చేశారు. ఇలా బిగ్‌ హ్యాండిచ్చాడు.
అల్లు అర్జున్‌.. `వకీల్‌సాబ్‌` డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌తో `ఐకాన్‌` సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత హ్యాండిచ్చాడు. కొరటాలతో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు అది కూడా లేదు.

తనకు `మహర్షి` లాంటి సూపర్‌ హిట్‌ అందించిన వంశీపైడిపల్లితో మహేష్‌ నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు గతేడాది ప్రారంభంలో ప్రకటించారు. ఆ తర్వాత ఆయనకు హ్యాండిచ్చి పరశురామ్‌తో `సర్కారు వారి పాట`ని ప్రకటించి బిగ్‌ షాక్‌ ఇచ్చారు.
మహేష్‌ హ్యాండివ్వడంలో ముందుంటున్నారు. ఆయన మూడేళ్ల క్రితం సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆ సినిమా లేదని మరో సినిమాని అనౌన్స్ చేసి షాక్‌ ఇచ్చారు.
మెగాస్టార్‌ చిరంజీవి తన రీఎంట్రీ సినిమా పూరీ జగన్నాథ్‌తో ఉంటుందని ప్రకటించారు. `ఆటోజానీ` అనే పేరు కూడా కన్ఫమ్‌ చేశారు. ఆ తర్వాత హ్యాండిచ్చి వివి వినాయక్‌తో `ఖైదీ నెంబర్‌ 150` చేశారు. దీంతోపాటు సుజిత్‌కి హ్యాండిచ్చి `లూసీఫర్‌` రీమేక్‌ మోహన్‌రాజాతో చేయబోతున్నారు.
విజయ్‌ దేవరకొండ కూడా డైరెక్టర్లకి షాక్‌ ఇచ్చిన స్టార్స్ ఖాతాలో చేరారు. ఆయన శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత `లైగర్‌`కి కమిట్‌ అయ్యాడు. నెక్ట్స్ సుకుమార్‌తో మరో సినిమాని అనౌన్స్ చేశాడు.
రైటర్‌ వక్కంతం వంశీపై ఓ సినిమా చేయబోతున్నట్టు గతంలో ఎన్టీఆర్‌ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆయనకు తారక్‌ పెద్ద షాకే ఇచ్చారు.
ఇక్కడ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ వెంకటేష్‌కి హ్యాండిచ్చాడు. నాలుగేళ్ల కిత్రం వెంకీ, త్రివిక్రమ్‌ సినిమాని ప్రకటించారు. ఆ తర్వాత వెంకీకి హ్యాండిచ్చి పవన్‌తో సినిమా చేశాడు త్రివిక్రమ్‌.
స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల బన్నీకి షాక్‌ ఇచ్చాడు. అల్లు అర్జున్‌తో `ఆచార్య` తర్వాత సినిమా చేస్తానని అనౌన్స్ చేశారు. కానీ ఉన్నట్టుండి ఎన్టీఆర్‌తో ప్రకటించారు.

Latest Videos

click me!