మహేష్‌ రష్మికని మర్చిపోయాడా? లేక కావాలని వదిలేశాడా? పేరు మిస్సింగ్‌పై ట్రోలింగ్‌

Published : Jan 05, 2022, 04:59 PM IST

మహేష్‌బాబు.. ఇప్పుడు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ హార్ట్ కి దగ్గరయ్యాడు. ఒక్క ట్వీట్‌తో అనేక రూమర్లకి చెక్‌ పెట్టాడు. అదే సమయంలో కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. నేషనల్‌ క్రష్‌ని మిస్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
16
మహేష్‌ రష్మికని మర్చిపోయాడా? లేక కావాలని వదిలేశాడా? పేరు మిస్సింగ్‌పై ట్రోలింగ్‌

మహేష్‌బాబు(MaheshBabu) `పుష్ప`(Pushpa) చిత్రాన్ని అభినందిస్తూ మంగళవారం ట్వీట్‌ చేశారు. అల్లు అర్జున్‌ నటనపై ప్రశంసలు కురిపించారు. పుష్ప పాత్రలో అద్భుతమైన నటనని ప్రదర్శించారని కొనియాడారు. మరోవైపు దర్శకుడు సుకుమార్‌ని సైతం ఆకాశానికి ఎత్తేశాడు. రా, రస్టిక్‌ సినిమాని తీశారని తన క్లాస్‌ వేరే లెవల్‌ అని తెలిపారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ని కూడా ఆయన అభినందించారు. ప్రస్తుతం Mahesh ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి. దీనికి బన్నీ కూడా రియాక్ట్ అయి ధన్యవాదాలు తెలిపారు. 

26

మహేష్‌ ట్వీట్‌కి, బన్నీ రిప్లైతో ఇద్దరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మహేష్‌ ఇలా చేస్తాడని ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు. మతిపోయిలా ఉందని, ఇది నిజమేనా? అంటూ బన్నీ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మహేష్‌ ఫ్యాన్స్ మాత్రం బాబు మనసు గోల్డ్ అని పోస్ట్ లు పెడుతున్నారు. బాబులకు బాబు మా మహేష్‌బాబు` అంటూ ట్వీట్లు చేయడం విశేషం. మొత్తం బన్నీ ఫ్యాన్స్ సైతం మహేష్‌పై అభినందనలు కురిపిస్తున్నారు. దీంతో గత కొంత కాలంగా ఇద్దరి అభిమానుల మధ్య సాగుతున్న వార్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టినట్టయ్యింది. వారంతా ఖుషీ అవుతున్నారు. 

36

ఇంత వరకు బాగానే ఉంది. కానీ మరో కొత్త వివాదాన్ని క్రియేట్‌ చేసినట్టయ్యింది మహేష్‌ ట్వీట్‌. దానికి కారణం ఆయన తన ట్వీట్ లో అల్లు అర్జున్‌, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌, నిర్మాతలను ప్రశంసించారు. కానీ నేషనల్‌ క్రష్‌ రష్మిక(Rashmika Mandanna))ని మెన్షన్‌ చేయలేదు. ఆమె పేరుని మెన్షన్‌ చేయకపోవడం ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. రష్మిక అభిమానులు ఫీలవుతున్నారు. 

46

అయితే మహేష్‌.. National Crush Rashmika పేరుని మెన్షన్‌ చేయకపోవడమనేది ఆయన మర్చిపోయాడా? లేక కావాలని స్కిప్‌ చేశాడా? అనే అనుమానాలు ఊపందుకున్నాయి. అయితే మహేష్‌ మర్చిపోయి ఉంటారని అంతా భావిస్తున్నారు. కావాలని అలా చేయకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం `సరిలేరు నీకెవ్వరు`లో మహేష్‌తో నటించింది రష్మిక. కాబట్టి మర్చిపోవడానికి వీల్లేదు. కావాలనే మహేష్‌ ఆమె పేరుని స్కిప్‌ చేశారని అంటున్నారు. 

56

మహేష్‌, రష్మిక `సరిలేరునీకెవ్వరు` చిత్రంలో నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్‌ అయ్యింది. ఆ సమయంలో మహేష్‌పై రష్మిక ప్రశంసలు కురిపించింది. మరి అయినా మహేష్‌ మిస్‌ చేయడమేంటనేది కొత్త చర్చకి తెరలేపినట్టయ్యింది. అయితే రష్మిక ఓవరాక్షన్‌ చేస్తుందని, ఈ క్రమంలో మహేష్‌ని ఎక్కడో నొప్పించి ఉంటుందనే వాదన కూడా నెటిజన్ల నుంచి వినిపిస్తుంది. `ఓవర్‌ రేటెడ్‌ రష్మిక.. మెన్షన్‌ చేయకపోవడమే బెటర్‌` అంటూ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.  ఆమె పేరు మెన్షన్‌ చేస్తే ఓ బాధ, చేయకపోతే మరో బాధ అంటూ కామెంట్‌ చేయడం విశేషం. 

66

మొత్తంగా రష్మిక ఇప్పుడు అటు మహేష్‌ ఫ్యాన్స్, ఇటు బన్నీ ఫ్యాన్స్‌ ట్రోల్స్ కి గురవుతుంది. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మరి దీనిపై రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో? చూడాలి.  రష్మిక ప్రస్తుతం నేషనల్‌ క్రష్‌గానే కాదు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తుంది. బాలీవుడ్‌లో మూడు సినిమాల్లో నటిస్తున్న ఆమె తెలుగులో `పుష్ప` రెండో పార్ట్ లో, అలాగే `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రం చేస్తుంది. 

also read: Mahesh Allu Arjun Controversy: దిగొచ్చిన మహేష్‌.. ఐకాన్‌స్టార్‌తో వివాదానికి చెక్‌ ?.. బన్నీ స్వీట్‌ పోస్ట్

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories