కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ కూడా సోషల్ మీడియా నుంచి వచ్చిందే. కాకపోతే శ్రీలీలా డ్యాన్స్ అదరగొట్టడంతో కాస్త కమర్షియల్ గా వర్కౌట్ అయినట్లు చెబుతున్నారు. తండ్రి, కొడుకు, కూతురు సెంటిమెంట్ లేకుండా త్రివిక్రమ్ సినిమాలు ఉండవు. అయితే అవన్నీ ఎలాగోలా వర్కౌట్ అవుతూ వచ్చాయి. కానీ గుంటూరు కారం పూర్తిగా బెడిసికొట్టింది అని అంటున్నారు.