బోయపాటి శ్రీనుపై ఊగిపోతున్న మహేష్‌ ఫ్యాన్స్.. `1200 చిన్నారుల హార్ట్ ఆపరేషన్స్ మర్చిపోయావా`.. ట్రోలింగ్‌

Published : Mar 04, 2022, 01:41 PM IST

మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను.. సూపర్‌స్టార్‌ మహేష్‌ అభిమానులకు అడ్డంగా దొరికిపోయారు.  మహేష్‌ బాబు చేస్తున్న సేవలు గుర్తు రావడం లేదా? అంటూ `అఖండ` డైరెక్టర్‌ని టార్గెట్‌ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. 

PREV
16
బోయపాటి శ్రీనుపై ఊగిపోతున్న మహేష్‌ ఫ్యాన్స్.. `1200 చిన్నారుల హార్ట్ ఆపరేషన్స్ మర్చిపోయావా`.. ట్రోలింగ్‌

`అఖండ`(Akhanda) చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ని అందుకున్నారు బోయపాటి శ్రీను(Boyapati Sreenu). ఫెయిల్యూర్‌లో ఆయన ఫుల్‌ ఎనర్జీని పొందితే,  వరుస పరాజయాల్లో ఉన్న బాలయ్యకి పెద్ద బూస్ట్ నిచ్చారు. బాలయ్య(Balayya) ఫ్యాన్స్ లో జోష్‌ని నింపారు. మంచి ఫామ్‌లో ఉన్న బోయపాటి తాజాగా సూర్య హీరోగా రూపొందిన `ఈటీ`(ET) మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హాజరయ్యారు. హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం ఈ ఈవెంట్‌ జరగ్గా, రానా, బోయపాటి, గోపీచంద్‌ మలినేని వంటి వారు గెస్టులుగా పాల్గొన్నారు. 

26

ఈ వేడుకలో Boyapati Sreenu మాట్లాడే క్రమంలో ఆడియెన్స్ అరుపులతో హోరెత్తించారు. `అఖండ` డైలాగ్స్ చెబుతూ గట్టిగా గోల చేశారు. వాళ్లని నిలువరించిన బోయపాటి సూర్యపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఆయన సేవాతత్వాన్ని అభినందించారు. తాను ఇటీవల సూర్య ఇంటర్యూ చూశానని, తాను ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఉంటే నా వద్దకి రండి, నేను ఫ్రీగా ట్రీట్‌మెంట్‌ చేయిస్తాను. సపోర్ట్ చేస్తానని తెలిపారని, అది తనకు చాలా సంతోషంగా అనిపించిందన్నారు. 
 

36

`ఈ ఛారిటీ వల్ల మీరు మాత్రమే బాగుండటం కాదు, మీ పిల్లలు, వారి తర్వాతి జనరేషన్స్ అందరూ బాగుంటుంద`ని సూర్య(Suriya)ని ప్రశంసించారు. అయితే ఇది మొదటగా మన తెలుగులోనే స్టార్ట్ అయ్యిందన్నారు. బాలయ్య బాబు క్యాన్సర్‌ తో బాధపడుతున్న ఎంతో మందిని బసవతారకం ఆసుపత్రిలో క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత చిరంజీవి(Chiranjeevi) గారు బ్లడ్‌ బ్యాంక్‌ ఛారిటీని ఏర్పాటు చేసి బ్లడ్‌ని ఉచితంగా అందిస్తున్నారు. ఆపదలో ఉన్న ఎంతో మందిని ఆదుకుంటున్నారని తెలిపారు. ఆ తర్వాత సూర్యగారు ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు.

46

అయితే ఇక్కడే మహేష్‌(Maheshbabu) ఫ్యాన్స్ కి మండింది. తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి పేర్లని చెప్పిన బోయపాటి.. మహేష్‌బాబు పేరుని ప్రస్తావించకపోవడం వారి కోపానికి కారణమయ్యిందట. మహేష్‌బాబు ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్‌ చేయిస్తున్నారు. ఇటీవల బాలయ్య టాక్‌ షో `అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే`షోలో కూడా mahesh ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు 1200 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్‌ చేయించినట్టు ఏకంగా బాలయ్యనే తెలిపారు. 

56

తన కుమారుడు గౌతమ్‌ చిన్నప్పుడు ఏడు నెలల్లోనే పుట్టాడని, ఆ సమయంలో తను అరచేతి అంతే ఉన్నాడని, అది చాలా బాధ కలిగించిందని, తనకు డబ్బుంది ట్రీట్‌మెంట్‌ చేయించాను. కానీ పేదవాళ్ల పరిస్థితేంటని ఆలోచించి ఆ సమయంలో చిన్నారులకు హార్ట్ ఆపరేషన్‌ చేయించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు మహేష్‌. ఇది ఆ సమయంలో వైరల్‌గా మారింది. అందరిని ఆకట్టుకుంది. 

66

కానీ ఆ విషయాన్ని బోయపాటి `ఈటీ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం, మర్చిపోవడంతో మహేష్‌ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. దీంతో 1200 మంది చిన్నారుల హార్ట్ ఆపరేషన్‌ చేయించిన మహేష్‌ని ఎలా మర్చిపోతావ్‌ బోయపాటి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. మరి దీనిపై బోయపాటి స్పందిస్తారా? లేదా? అన్నది చూడాలి. కానీ ఇప్పుడు మహేష్‌ ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories