`సర్కారు వారి పాట` ఫెయిల్యూర్‌కి ఐదు కారణాలు ?.. మహేష్‌ చేసిన ఆ తప్పే కొంప ముంచిందా?

Published : May 13, 2022, 02:00 PM ISTUpdated : May 13, 2022, 02:27 PM IST

మహేష్‌బాబు నటించిన `సర్కారు వారి పాట` చిత్రం గురువారం విడుదలై డివైడ్‌ టాక్‌ని తెచ్చుకుంటోంది. దారుణంగా ట్రోల్స్ కి గురవుతుంది. మొదటి షో నుంచి డిజాస్టర్‌ అంటున్నారు నెటిజన్లు. మరి ఈ సినిమా పరాజయం చెందడానికి కారణమేంటనేది చూస్తే ప్రధానంగా ఐదు రీజన్స్ కనిపిస్తున్నాయి. 

PREV
16
`సర్కారు వారి పాట` ఫెయిల్యూర్‌కి ఐదు కారణాలు ?.. మహేష్‌ చేసిన ఆ తప్పే కొంప ముంచిందా?

ఒకటి - పరశురామ్‌ కథ..
`గీతగోవిందం` వంటి బ్లాక్‌ బస్టర్‌ని అందించిన దర్శకుడు పరశురామ్‌(Parasuram) `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata)ని సరిగా డీల్‌ చేయలేకపోయారనే కామెంట్లు నెటిజన్ల నుంచి, అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. మహేష్‌(Maheshbabu) వంటి సూపర్‌ స్టార్‌ని సరిగా ఎలివేట్‌ చేయలేకపోయారని, హీరోయిజం వర్కౌట్‌ కాలేదంటున్నారు. కథ కూడా సినిమాకి మైనస్‌. బ్యాంక్‌ కుంభకోణాలనేది రియల్‌ ఇన్స్ డింట్‌, బలమైనది కూడా. దాన్ని ఇంకా లోతుగా, బలంగా, ఎమోషన్స్ క్యారీ అయ్యేలా చెప్పాల్సింది. కేవలం పైపైనే టచ్‌ చేసి వదిలేశాడు దర్శకుడు. అదే సమయంలో ఎమోషన్స్ పండలేదు. దీంతో ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేదంటున్నారు.

26

రెండు - సందేశం
మహేష్‌ మరోసారి సందేశం పాయింట్‌ని ఎత్తకుని తప్పు చేశారని, అదే కొంపముంచిందంటున్నారు. మహేష్‌ వరుసగా సందేశాత్మక చిత్రాలు చేశారు. `శ్రీమంతుడు`, `బ్రహ్మోత్సవం`, `భరత్‌ అనే నేను`, `మహర్షి` ఇలా నాలుగు సినిమాలు సందేశంతో కూడినవే. ఇప్పటికే ఫ్యాన్స్ తోపాటు సాధారణ ఆడియెన్స్ కి కూడా ఇవి బోర్‌ కొట్టాయి. బలమైన పాయింట్‌ని, అంతే ఎమోషనల్‌ కనెక్టివిటీతోనే చెబితే ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది, లేదంటే బెడిసి కొడుతుంది. `సర్కారు వారి పాట`లో అదే జరిగింది. నిజానికి సందేశంతో పనిలేకుండా మంచి కమర్షియల్‌ సినిమా చేసినా బాగానే వర్కౌట్‌ అయ్యేది. సందేశం ఉన్న రెండో భాగమే ప్రధాన మైనస్‌గా నిలిచిందనే టాక్‌ ఇంటర్నెట్‌లో సర్య్కూలేట్‌ అవుతుంది.
 

36

మూడు- ఎంటర్‌టైన్‌మెంట్‌
`సర్కారు వారి పాట` చిత్రంలో ప్రధానంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ లోపించింది. వెన్నెల కిషోర్‌(Vennela Kishore), మహేష్‌కి మధ్య వచ్చే సన్నివేశాలు కామెడీని పంచుతాయని భావించారు. `దూకుడు`లో అదే వర్కౌట్‌ అయ్యింది. కానీ `సర్కారు వారి పాట`లో తీరా వీరి కాంబినేషన్‌ సీన్స్ లో వర్కౌట్‌ కాలేదు. కామెడీ పండలేదు. దీంతో సినిమా కాస్త `బ్రహ్మోత్సవం` రిజల్ట్ ని చవిచూడాల్సి వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇందులో ప్రధాన లోపంగా చెబుతున్నారు క్రిటిక్స్.
 

46

నాలుగు - తమన్‌ బీజీఎం
సినిమాలో తమన్‌ (Thaman) అందించిన పాటలు ప్లస్‌ అయ్యాయి. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. వంద మిలియన్స్ కి చేరువలో ఉన్నాయి. పాటలు అదిరిపోయాయి కానీ బీజీఎం విషయంలో మాత్రం గట్టి దెబ్బ పడింది. `అఖండ` చిత్రంలో తమన్‌ బీజీఎం బాగా హెల్ప్ అయ్యింది. బాలయ్య మార్క్ యాక్షన్‌ ఎలిమెంట్స్ కి బీజీఎం తోడవ్వడంతో సినిమా మరో స్థాయికి వెళ్లింది. కానీ ఇందులో అదే బెడిసి కొట్టడం గమనార్హం. అన్ని సినిమాలకు తమన్‌ రెగ్యూలర్‌గా బీజీఎం కొడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. యాక్షన్‌ సీన్‌ వచ్చిందంటే డప్పుల మోత మోగిస్తున్నారు. రొటీన్‌ కొట్టుడు ఆడియెన్స్ కి విసుగు పుట్టిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. `సర్కారు వారి పాట` విషయంలో బీజీఎం పెద్ద మైనస్‌ అనేది మహేష్‌ ఫ్యాన్స్ నుంచి కూడా వినిపిస్తున్న టాక్‌.

56

ఐదు - టికెట్‌ రేట్లు
పెరిగిన టికెట్‌ రేట్లు (SVP Ticket Rates) కూడా `సర్కారు వారి పాట` చిత్రానికి పెద్ద మైనస్‌గా మారాయని చెప్పొచ్చు. ఇప్పటికే `ఆర్‌ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌2` చిత్రాలతో భారీగా పెట్టి ఉన్నారు జనం. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా భారీగా కదిలారు. దీంతో జేబులు ఖాళీ అయ్యాయి. మళ్లీ  నాలుగు వందలు పెట్టి సినిమా చూసేందుకు జనం సిద్ధంగా లేరు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కదలడం లేదు. ఈ చిత్రానికి కూడా టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించాయి రెండు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు. దీంతో మల్టీఫ్లెక్స్ ల్లో టికెట్‌ రేట్లు దాదాపు నాలుగు వందల రూపాయలున్నాయి. ఇంత పెట్టి సినిమా చూసే ఆసక్తి జనం చూపించకపోవడం పద్ద మైనస్‌. `ఆచార్య` విషయంలో అదే జరిగింది. ఇప్పుడు `సర్కారు వారి పాట`కీ అదే జరుగుతుంది. బెనిఫిట్‌ షోస్‌లో సగం సీట్లు ఖాళీగానే ఉండటం గమనార్హం.

66

మొత్తంగా మహేష్‌కి వరుస హిట్ల తర్వాత డిజాస్టర్‌ పడిందని అంటున్నారు నెటిజన్లు. నిన్నటి నుంచి `డిజాస్టర్‌ ఎస్వీపీ` అనే యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. మహేష్‌కి జోడీగా కీర్తిసురేష్‌ కథానాయికగా నటించిన `సర్కారు వారి పాట` చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహించగా, మైత్రీమూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్‌ సంయుక్తంగా నిర్మించాయి. గురువారం(మే 12)న ఈ చిత్రం విడుదలైంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories