ఈ ఏడాది కియారా హీరోయిన్ గా నటించిన ‘భూల్ భులియా 2’ బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపింది. ప్రస్తుతం హిందీలో ‘గోవింద నామ్ మేరా’, తెలుగులో ‘ఆర్సీ15’(RC15)లో నటిస్తోంది. ఇటు షూటింగ్ ల్లో పాల్గొంటూనే.. టీవీ షోల్లోనూ మెరుస్తోంది. లేటెస్ట్ గా బాలీవుడ్ పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’కు షాహిద్ కపూర్ తో కలిసి మెరిసింది. తనదైన శైలిలో కరణ్ ప్రశ్నలకు బదులిచ్చింది.