సితార ఘట్టమనేని రాయల్ లుక్.. మెరిసిపోయే ఆభరణాల్లో ప్రిన్సెస్ లా వెలిగిపోతున్న మహేశ్ బాబు కూతురు

First Published | Jul 4, 2023, 5:47 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితారా ఘట్టమనేని రేర్ ఫీట్ సాధించింది. చిన్న వయస్సులోనే అతిపెద్ద జ్యూవెల్లరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా ఎంపికైంది. ఇందుకు సంబంధించిన యాడ్ షూట్ కూడా పూర్తైంది. 
 

సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితారా ఘట్టమనేని (Sitara Ghattamaneni) ప్రస్తుతం స్కూలింగ్ చేస్తున్నారు. మరోవైపు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు మహేశ్ బాబు గారాలపట్టి సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. వరుస పోస్టులతో అలరిస్తోంది.
 

ఇదిలా ఉంటే.. సితారా తాజాగా రేర్ ఫీట్ సాధించింది. చిన్న వయస్సులోనే అతిపెద్ద జ్యూవెల్లరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా మారి అరుదైన ఘనతను సాధించింది. ఇంటర్నేషనల్ జ్యూవెల్లరీ పీఎంజే జ్యూవెల్లరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉంది. దీంతో ఇటీవల ఫొటోషూట్ కూడా పూర్తైంది. 
 


ఈరోజు న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార హోర్డింగ్స్ కనిపించాయి. దీంతో మహేశ్ బాబు నమ్రతా శిరోద్కర్ సితారను అభినందిస్తూ పోస్టులు సైతం పెట్టారు. అయితే హోర్డింగ్స్ లో ఉన్న సితారా తాజాగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో నెట్టింట వైరల్ గా మారాయి. 
 

తాజాగా పంచుకున్న ఫొటోస్ లో సితార రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. గ్రీన్ డ్రెస్, లైట్ గ్రీన్, పింక్ డ్రెస్ లో యువరాణిలా మెరిసిపోయింది. ఖరీదైన ఆభరణాలు ధరించి ప్రిన్సెస్ లా కనిపించింది. క్యూట్ స్మైల్, ఆర్షణీయమైన రూపసౌందర్యంతో యువరాణిలా ఆకట్టుకుంది.  
 

ఈ లుక్ లో సితారను చూసిన అభిమానులు పొగడ్తలతో ముంచేస్తున్నారు. మరోవైపు అరుదైన ఘనత సాధించినందుకు అభినందిస్తున్నారు. తండ్రి మించిపోయేలా ఉందంటున్నారు. ఇక ఈ ఫొటోలను షేర్ చేస్తూ సితారా ఇంట్రెస్టింగ్ నోట్ రాసుకొచ్చింది.
 

నోట్ ప్రకారం..  pmj jewels అంబాసిడర్ గా ఉన్నందుకు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. ఈరోజు TimesSquareలో ప్రారంభించబడిన 'సితార సిగ్నేచర్ కలెక్షన్'ని చూడండి.  నాలాగే మీరందరూ ఇష్టపడతారని ఆశిస్తున్నాను. PMJSitara వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి. హైదరాబాద్ లో జూలై 6న, జూలై 13 విజయవాడలో స్టోర్స్  లాంచ్ కానున్నట్టు కూడా తెలిపింది. 
 

Latest Videos

click me!