థాయిలాండ్ లో శ్రీముఖి.. లోయాంగిల్లో కెమెరాకు ఫోజులిచ్చి రచ్చ... మాకు అలా కావాలంటూ నెటిజన్ల గోల..

First Published | Jul 4, 2023, 4:11 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi)  సోషల్ మీడియాలో మళ్లీ సూపర్ యాక్టివ్ అయ్యారు. దీంతో బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ అలరిస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.
 

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోతోంది. వరుస షోలతో టీవీ ఆడియెన్స్ ను ఎప్పుడూ అలరిస్తోంది. ప్రస్తుతం రెండు, మూడు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ప్రతివారం స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తోంది. 
 

మరోవైపు శ్రీముఖి సోషల్ మీడియాలోనూ ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. మొన్నామధ్యలో కాస్తా సైలెంట్ అయిన ఆమె మళ్లీ మొదలు పెట్టింది. తన ఫ్యాన్స్ ను ఎప్పుడూ ఏదోలా అలరించేలా ప్రయత్నిస్తోంది. 


ఈ సందర్భంగా శ్రీముఖి వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. రోజురోజుకు అందంగా కనిపించి అభిమానులతో పాటు నెటిజన్లను మంత్ర ముగ్ధులను చేస్తోంది. 
 

ఇక తాజాగా శ్రీముఖి తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. అయితే అవి లేటెస్ట్ వి కావని, సమ్మర్ లో మే10న థాయిలాండ్ కు వెళ్లిన సందర్భంగా దిగినవి క్యాప్షన్ లో తెలిపింది. ఇక వెకేషన్ లో ఈ బ్యూటీ అందాల రచ్చ చేసింది.
 

యాచ్ లో తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించింది. నేచర్ కు మరింత దగ్గరవుతూ కొత్త ఎనర్జీని నింపుకుంది. మరోవైపు బీచ్ వేర్ లో స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చి  మతులు పోగొట్టింది. 
 

వెకేషన్ లో శ్రీముఖి చేసిన రచ్చకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ అందాల విందుకు నెటిజన్లు చూపుతిప్పుకోలేకపోతున్నారు. జాలిలాంటి గ్రీన్ డ్రెస్, లోపల బ్లాక్ బికినీ ధరించింది. బీచ్ లో రచ్చరచ్చ చేస్తూ కనిపించింది.  

మరోవైపు స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. మత్తెక్కించే స్టిల్స్ లో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. లోయాంగిల్ లోనూ ఫొటోలకు ఘాటుగా ఫోజులిచ్చింది. మరిన్ని స్టిల్స్ లో కట్టిపడేసింది. నిషా కళ్లతో ఊపిరాడకుండా చేసింది.
 

ఈ ఫొటోలను చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీ సెటైర్లు పేల్చుతున్నారు. ‘ఇలా కాదు.. బికినీలో చూడాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు తన అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక ప్రస్తుతం శ్రీముఖి చిరంజీవి ‘భోళా శంకర్’లో నటిస్తోంది. 

Latest Videos

click me!