తండ్రికి తగ్గ తనయ అనిపిస్తోంది స్టార్ కిడ్ సితార ఘట్టమనేని. సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu కూతురుగా సితార అందరికీ పరిచయమే. అలాగే సోషల్ మీడియాలోనూ స్టార్ కిడ్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ప్రస్తుతం స్కూలింగ్ పూర్తి చేసుకుంటున్న సితార తనకు సమయం ఉన్నప్పుడల్లా ప్రశంసలు అందుకునే పనులు చేస్తోంది. మంచి మనస్సును చాటుకుంటూ అందరి మన్ననలు పొందుతోందీ చిన్నారి.
ఇప్పటికే మహేశ్ బాబు గారలపట్టి తన పుట్టిన రోజు సందర్భంగా అనాథ పిల్లలకు సైకిళ్లు పంపిణీ చేయడం, తన ఫస్ట్ యాడ్ ఫిల్మ్ రెమ్యునరేషన్ ను చారిటీకి అందించి అభినందనలు అందుకుంది.
ఇక తాజాగా మరోసారి తన మంచి మనస్సును చాటుకుంది. తండ్రి మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘గుంటూరుకారం’ Guntur Kaaram సినిమాను అనాథ పిల్లలతో కలిసి వీక్షించింది.
AMB సినిమాస్ లో చీర్స్ ఫౌండేషన్ కు సంబంధించిన నలబై మంది వరకు అనాథ పిల్లలతో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చూసింది. ఎంబీ ఫౌండేషన్ తరుఫున వారికోసం స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిన్నారి గొప్ప మనస్సుకు మహేశ్ బాబు అభిమానులతో పాటు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చిన్న వయస్సులోనే గొప్పగా ఆలోచిస్తున్న సితారను మెచ్చుకుంటున్నారు.