trisha salary in leo starring thalapathy vijay
ఫిల్మ్ఇండస్ట్రీ ఈమధ్య సంచలనాలు వేధికగా మారింది. బాలీవుడ్ తో పాటు.. సౌత్ లో ... మరీ ముఖ్యంగా తెలుగు,తమిళ ఫిల్స్ ఇండస్ట్రీలలో వివాదాలు ఈమధ్య ఎక్కువైపోయాయి. ఎప్పటికప్పుడు కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి. ఈమధ్య నయనతార వివాదం ముగిసింది అనుకుంటే.. తాజాగా కోలీవుడ్లో విజయ్ దళపతి, త్రిషల వివాదం బయటకు వచ్చింది.
నటుడు విజయ్ మరియు నటి త్రిష తమిళ చిత్రసీమలో టాప్ స్టార్స్. వీరిద్దరూ చాలా సినిమాల్లో జంటగా నటించారు. విజయ్, త్రిష కలిసి నటించిన ఫస్ట్ మూవీ గిల్లీ. ఈసినిమా 2004లో రిలీజ్ అయ్యి.. తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ మరో స్థాయిలో వర్కవుట్ కావడంతో .. వీరి కాంబోలో మరికొన్ని సినిమాలు కూడా వెంట వెంటనే వచ్చాయి.
గిల్లి తర్వాత విజయ్ త్రిష.. మూడు సినిమాల్లో నటించింది. ఆతరువాత వీరి కాంబోలో సినిమాలు రాలేదు. దాదాపు 15 ఏళ్ల పాట వీరి కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఇక త్రిష హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయ్యింది అనకున్న టైమ్ లో.. త్రిష హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వడం.. పొన్నియన్ సెల్వన్ తో హిట్ కొట్టడం.. వెంటనే విజయ్ సరసన అవకాశం వచ్చింది.
సుమారు 15 ఏళ్ల నిరీక్షణ తర్వాత విజయ్ మరియు త్రిష మళ్లీ లియోలో కలిసి నటించారు. గతేడాది విడుదలైన ఈ సినిమాలో విజయ్‌కి భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా త్రిష నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇక వీరిద్దరికి సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం తమిళనాట సంచలనంగా మారింది.
Vijay thalapathy Sangeetha
సాధారణంగా హీరో, హీరోయిన్లు ఎక్కువ సినిమాల్లో జంటగా నటిస్తే వారిపై రూమర్స్ కామన్ గా వస్తుంటాయి. ఇలానే విజయ్ , త్రిషపై చాలా గాసిప్స్ వచ్చాయి . త్రిష వల్లనే విజయ్ కుటుంబంలో మనస్పర్థలు తలెత్తాయని, అతని భార్య సంగీత అతనితో విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. చాలా కాలం సాగిన ఈ వివాదం... కొంత కాలానికి సర్ధుమణిగింది. ఇక తాజాగా ఈ వివాదం రాజుకుంది. అది కూడా ఓ జర్నలిస్ట్ వల్ల..
trisha - vijay
అవునుప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ పాండియన్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్-త్రిష గురించి ఒక రహస్యాన్ని వెల్లడించాడు. దీని ప్రకారం నటి త్రిష ఇంట్లో ఐటీ దాడులు నిర్వహించి రూ.కోటి విలువైన డైమండ్ నెక్లెస్ నెక్లెస్ ను కనిపెట్టారని. అయితే దాని గురించి ఆమెను ఐటీ అధికారులు ప్రశ్నించగా, ఆ నెక్లెస్‌ను నటుడు విజయ్ తనకు బహుమతిగా ఇచ్చాడని త్రిష చెప్పినట్లు పాండియన్ పేర్కొన్నాడు.
దాంతో మరోసారి ఈవివాదం మొదటి కొచ్చింది. ఈ వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో ఉంది అన్న విషయంపై తమిళ ఫిల్మ్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో వారు స్పందిస్తారా..? లేఖ రూమర్స్ కామన్ అని వదిలేస్తారా..? అనేది చూడాలి. త్రిష మాత్రం వరుస సినిమాలతో జోరుమీద ఉంది. ఇక విజయ్ కూడా తన ప్లానింగ్ లో తాను ఉన్నారు.