Love Marriages in Tollywood : మహేశ్ బాబు టు వరుణ్ తేజ్.. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న తెలుగు హీరోలు.!

First Published | Feb 8, 2024, 9:48 PM IST

టాలీవుడ్ స్టార్స్ ప్రేమ వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు. వాలెంటైన్స్ వీక్ (valentines week) నడుస్తున్న తరుణంలో.. తెలుగు హీరోలు ఎవరెవరు లవ్ మ్యారేజెస్ చేసుకున్నారో తెలుసుకుందాం. 
 

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2005 ఫిబ్రవరి 10న వీరి వివాహం జరగడం విశేషం. వీరికి కొడుకు గౌతమ్, కూతురు సితార ఉన్నారు. లవ్ మ్యారేజ్ టాలీవుడ్ లో ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - స్నేహ రెడ్డి (Sneha Reddy) టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా నిలిచారు. వీరిది కూడా లవ్ మ్యారేజ్ కావడం విశేషం. 2011లో బన్నీ, స్నేహ వివాహం గ్రాండ్ గా జరిగింది. కొడుకు అయాన్, కూతురు అర్హ, ఉన్నారు. 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan - ఉపాసన కామినేని (Upasana Konidela)లు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి పెళ్లి 2012లో కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. గతేడాది కూతురు క్లింకార కూడా జన్మించింది. 

నేచురల్ స్టార్ నాని Nani - అంజనా యెలవర్తికి కూడా బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ఉంది. వీరిద్దరూ 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు చిన్ననాటి స్నేహితులు, చివరికి ప్రేమలో పడ్డారు. వీరికి కొడుకు ఉన్నాడు. 

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ Nikhil Siddhartha - పల్లవి వర్మ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం యంగ్ కపుల్ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. 2020లో వీరి మ్యారేజ్ గ్రాండ్ గా జరిగింది. 

ఇక రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ Varun Tej, యూపీ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 3న వీరి పెళ్లి ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. 
 

Latest Videos

click me!