Sneha : సైలెంట్ గా బిజినెస్ స్టార్ చేసిన స్నేహ... ‘వెంకీ’ హీరోయిన్ వ్యాపారం ఏంటో తెలుసా?

First Published | Feb 8, 2024, 8:26 PM IST

సీనియర్ హీరోయిన్ స్నేహ Sneha తాజాగా భర్తతో కలిసి వ్యాపారం మొదలు పెట్టారు. తన అభిమానులతో ఈ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నారు. సంబంధిత ఫొటోలను పంచుకున్నారు. 

సీనియర్ నటి స్నేహ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. సౌత్ లోని ఆయా భాషల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. ఇప్పటికీ ఆయా సినిమాల్లో నటిస్తున్నారు. 

200‌0 సంవత్సరం నుంచి 2011 వరకు హీరోయిన్ గా అలరించింది. సౌత్ లోని తమిళం, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించి అలరించింది. బమా హీరోల సరసన నటించి మెప్పించింది.  ఆ తర్వాత నుంచి కీలక పాత్రల్లో అలరిస్తున్నారు. 


సినిమాల జోరు కాస్తా తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన అభిమానులతో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటోంది. బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. 

మరోవైపు స్నేహ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. తన కొత్త వ్యాపారం ప్రారంభించినట్టు, త్వరలోనే ప్రారంభం అని చెప్పుకొచ్చింది. 

‘నా కెరీర్, జీవితంలో గొప్ప సపోర్ట్ గా నా ప్రియమైన అభిమానులకు, ఇన్నాళ్లూ మీరు నాపై కురిపించిన ప్రేమకు నేను మీ అందరికీ రుణపడి ఉంటాను. ఎవరి జీవితంలోనైనా వారి కలలు నెరవేరడం గొప్ప విషయం. నేను ఇప్పుడు అలాంటి అద్భుతమైన ఆనందంలో ఉన్నాను. 

నేను నా సొంత సిల్క్ చీర స్టోర్ ‘స్నేహలయా సిల్క్స్’ Snehalayaa Silksని ప్రారంభిస్తున్నాను. ఎప్పటిలాగే మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలను కోరుతున్నాను.’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా అభిమానులు స్నేహకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫిబ్రవరి 12న ఈ స్టోర్ ప్రారంభం కానుంది. 
 

Latest Videos

click me!