`అమ్మ`ని నమ్ముకుంటే లాభం లేదు.. మహేష్‌ బాబుకి మూడుసార్లు చేదు అనుభవం..

First Published | Feb 28, 2024, 5:04 PM IST

మహేష్‌ బాబు ఇటీవల `గుంటూరు కారం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అందులోని మెయిన్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ కాకపోవడమే అంటుంటారు. 
 

మహేష్‌ బాబు.. ఈ సంక్రాంతికి `గుంటూరు కారం` సినిమాతో వచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రూపొందించిన చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ప్రారంభం నుంచి నెగటివ్‌ టాక్ తెచ్చుకుంది. దీనికితోడు ట్రోలర్స్ రెచ్చిపోయారు. దారుణంగా నెగటివ్‌ టాక్‌ని స్ప్రెడ్‌ చేశారు. అది సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. లేదంటే చాలా వరకు సేఫ్‌ అయ్యేది. ఈ సినిమాలో అసలు సెంటిమెంట్‌ ఆడియెన్స్ కి కనెక్ట్ కాకపోవడమే దీనికి కారణమని క్రిటిక్స్ మాట. 
 

`గుంటూరు కారం` సినిమాలో కోర్‌ పాయింట్‌ తల్లి సెంటిమెంట్‌. చిన్నప్పుడు కొడుకుని, భర్తని వదిలేసి నాన్నతో వెళ్లిపోతుంది రమ్యకృష్ణ. ఆయన కోరిక మేరకు రాజకీయాల్లో రాణిస్తుంది. చిన్నప్పుడు దూరమైన తల్లికి దగ్గర కావాలనుకుంటాడు కొడుకు(మహేష్‌). ఆమెని చూడాలని, ఆమెతో మాట్లాడాలనుకుంటాడు. కానీ ఆమె దూరం పెడుతుంది. తండ్రి(ప్రకాష్‌ రాజ్‌) కోరిక మేరకు ఆమె పైకి అలా ప్రవర్తిస్తుంది. కానీ లోపల మాత్రం ఆ ప్రేమ అలానే ఉంటుంది. కొడుక్కు ఏ ఇబ్బంది రాకుండా, ఏ నష్టం జరగక్కుండా చూస్తుంది. అయితే ఆ మదర్‌ సెంటిమెంట్‌ ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేదు. క్యారీ అయ్యేలా చేయలేకపోయాడు త్రివిక్రమ్‌. దీంతో సినిమా బెడిసికొట్టింది. నిరాశ పరిచింది. 
 


మదర్‌ సెంటిమెంట్‌ మహేష్‌ కి వర్క్ కాలేదు. దీంతో నిరాశ తప్పలేదు. ఇప్పుడే కాదు, గతంలో రెండు సార్లు మదర్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ కాలేదు. ఆయన `గుంటూరు కారం`కి ముందు `నాని` సినిమాని మదర్‌ సెంటిమెంట్‌తోనే చేశాడు. అది ఒక ప్రయోగాత్మక మూవీ. ఇందులో మహేష్‌ బాబు చిన్నబాబుగా ఉంటాడు. కానీ అతనిపై సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు. దీంతో పెద్దగా అయిపోతాడు. ఈ క్రమంలో తన ఇంట్లో అమ్మ ఊరికే తనని తిడుతుంది, కొడుతుంది. మరి తనపై అమ్మకి ఎలాంటి భావన ఉందో తెలుసుకోవాలనుకుంటాడు చిన్నమహేష్‌. సైంటిస్ట్ వద్దకు వెళ్లి పెద్దగా అయిపోతాడు, అమ్మవద్దకి వెళ్లి తన గురించి అడిగి తెలుసుకుంటాడు.

దీంతో అమ్మ కొడుకు గురించి చాలా ముచ్చటగా చెబుతుంది, ఆ మధుర జ్ఞాపకాలను పంచుకుంటుంది.  సినిమా మొత్తం మదర్‌ సెంటిమెంట్‌తోనే సాగుతుంది. ఇందులో తల్లి పాత్రలో దేవయాని నటించింది. ఎస్‌ జే సూర్య దర్శకత్వం వహించారు. ఈ ప్రయోగాత్మక మూవీ బాక్సాఫీసు వద్ద డీలా పడింది. సినిమా ఆడలేదు. అమ్మ సెంటిమెంట్‌ బెడిసికొట్టింది. మహేష్‌ బాబు ఇలాంటి మూవీ చేయడం ఆడియెన్స్ తీసుకోలేకపోయారు. 
 

అంతకు ముందు మహేష్ బాబు హీరోగా తేజ `నిజం` మూవీని రూపొందించారు. 2003లో వచ్చిన ఈ సినిమాలో గోపీచంద్ విలన్‌గా మెప్పించాడు. తన తండ్రిని చంపినందుకు పగ తీసుకునే రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్‌గా `నిజం` మూవీ రూపొందింది.  సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. కొడుక్కి తల్లి ట్రైనింగ్ ఇచ్చి మరి పగ తీర్చుకునేందుకు రెడీ చేస్తుంది.
 

ఆ తర్వాత తల్లీ కొడుకుల మధ్యే కథ నడుస్తుంది. `ఒక్కడు` వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఈ మూవీలో మహేష్‌ని అలాంటి పాత్రలో చూడలేకపోయారు ఆడియెన్స్. దీంతో మదర్‌ సెంటిమెంట్ తేడా కొట్టింది. ఈ సినిమా తల్లూరి రామేశ్వరి అమ్మ పాత్రలో నటించింది. 

ఇలా మహేష్‌బాబు నటించిన `నిజం`, అలాగే `నాని` చిత్రంతోపాటు `గుంటూరు కారం` కూడా మదర్‌(అమ్మ) సెంటిమెంట్‌తో వచ్చాయి. బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేశాయి. అమ్మ సెంటిమెంట్‌ మహేష్‌ బాబుకి వర్కౌట్‌ కాదని నిరూపించాయి. మూడు సార్లు ఆయనకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. మరి మున్ముందు మహేష్‌ ఇలాంటి సెంటిమెంట్‌తో సినిమాలు చేస్తాడా అప్పుడైనా సక్సెస్‌ కొడతాడా చూడాలి. అయితే రాజమౌళి మూవీ ఫారెస్ట్ బేస్డ్ అడ్వేంచర్, ఇది పూర్తి కావడానికి మూడు నాలుగేళ్లు పడుతుంది.ఆ తర్వాత మహేష్‌ రేంజ్‌ పెరుగుతుంది. అప్పుడు ఇంకా మదర్‌ సెంటిమెంట్‌తో సినిమాలు చేయడం కష్టమే అని చెప్పొచ్చు.  

Latest Videos

click me!