2004లో శర్వానంద్ నటుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. యువసేన మూవీతో హీరో అయ్యాడు. నలుగురు హీరోల్లో ఒకడిగా శర్వానంద్ నటించాడు. యువసేన హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. గమ్యం, ప్రస్థానం చిత్రాలు శర్వానంద్ ని హీరోగా నిలబెట్టాయి. రన్ రాజా రన్, మహానుభావుడు, శతమానం భవతి చిత్రాలతో శర్వానంద్ టైర్ టు హీరోల జాబితాలో చేరాడు.
శర్వానంద్ పేరెంట్స్ బాగా స్థితిమంతులు అట. వీరిది బిజినెస్ ఫ్యామిలీ అని సమాచారం. హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్ళినా శర్వానంద్ కుటుంబానికి చెందిన ఆస్తులు ఉంటాయట. ఒక సన్నిహితుడితో కారులో హైదరాబాద్ లో సంచరిస్తూ.. ఆ స్థలం మాదే, ఈ ఇల్లు మాదే అంటూ... పలు ఏరియాల్లో ఉన్న తమ ఆస్తులు చూపించాడట శర్వానంద్.