సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న మొదటి సినిమా కోసం సూపర్ స్టార్ ఏం చేయబోతున్నాడంటే?
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ యంగ్ స్టార్ రాషా తడాని హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అశ్వినీ దత్ సమర్పణలో, చందమామ కథలు బ్యానర్‌పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు RX100 చిత్రంతో గుర్తింపు పొందిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.
24
అన్న కొడుకు కోసం రంగంలోకి మహేష్ బాబు.. ?
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. జయకృష్ణ ఫస్ట్ పిక్చర్ కావడంతో పాటు కృష్ణ మూడో తరం వారసుడిగా ఆయన ఎంట్రీ ఇవ్వడం కూడా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది. ఈ సినిమా జులై 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో ఈమూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. తన అన్న కొడుకుని ఇండస్ట్రీలో సెట్ చేయడం కోసం ఆయన కొన్ని బాధ్యతలు తీసుకున్నట్టు సమాచారం.
34
ప్రీరిలీజ్ లో మహేష్ ఏం చేయబోతున్నాడు?
శ్రీనివాస మంగాపురం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ వార్త ఘట్టమనేని అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. సమాచారం ప్రకారం, శ్రీనివాస మంగాపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 2న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని శిల్పకళాలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు హాజరై తన అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణను అభిమానులకు అధికారికంగా పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మహేష్ బాబు ఈ ఈవెంట్ కు వస్తే.. సూపర్ స్టార్ అభిమానులంతా అక్కడికి వస్తారు. జయకృష్ణ సినిమాకు పబ్లిసిటీతో పాటు.. అతని తరువాత సినిమాలు కూడా కృష్ణ అభిమానులు భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కృష్ణ వారసత్వం, మహేష్ బాబు సపోర్ట్ తో పాటు జయకృష్ణ తన టాలెంట్ కూడా చూపించి.. కాస్త కష్టపడితే.. టాలీవుడ్ కి మూడో సూపర్ స్టార్ దొరికినట్టే అని చెప్పాలి. జయకృష్ణ తొలి సినిమాతోనే ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన అందుకుంటాడో చూడాలి.